ప్రజాశక్తి-విజయవాడ సిటీ : పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి బయటి రాష్ట్రాల నుంచి రౌడీలను రప్పించి టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఆరోపించారు. రాయలసీమలో చోటుచేసుకుంటున్న వైసీపీ హింసాత్మక ఘటనలపై వర్ల రామయ్య నేతృత్వంలో టీడీపీ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా దాడులకు సంబంధించిన దృశ్యాలున్న పెన్‌డ్రైవ్‌ను ఎస్ఈసీకి అందజేసి, బాధ్యులైన వారిపై తక్షణ విచారణ జరపాలని కోరారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 32 కార్లతో మిథున్‌రెడ్డి నామినేషన్‌కు రావడమంటేనే అక్కడ పెద్ద కుట్ర జరుగుతోందని వర్ల రామయ్య విమర్శించారు. ఎన్నికల్లో గెలవలేమనే నిరాశతోనే వైసీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాలని, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ కుప్పం రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
మిథున్‌రెడ్డిపై ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026, 09:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)