- సుప్రీంకోర్టులో విజయన్ పిటిషన్..
న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి, కేరళలోని కాంగ్రెస్ నేతృత్వ యుడిఎఫ్ ప్రభుత్వం కలిసికట్టుగా సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్పైనా, ఆయన కుటుంబంపైనా వేధింపులను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాత కేసులను తిరగదోడుతున్నాయి. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సిఎంఆర్ఎల్)కు సంబంధించిన ఓ కేసులో ఈ నెల 23న కొచ్చిలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసింది.
కాగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ పినరయి విజయన్ శుక్రవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారణకు చేపట్టాలని విజయన్ తరపున వాదిస్తున్న న్యాయవాది కోరారు. అంతేకాకుండా, తన క్లయింట్ విజయన్కు కఠిన చర్యల నుంచి రక్షణ కల్పించాలని భారత ప్రధానన్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జస్టిస్ సూర్యకాంత్ ఈ అంశంపై దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 26న విచారణ చేపడతామని తెలిపారు. న్యాయమూర్తులు అందుబాటులో ఉంటే, వచ్చే వారం సెలవు దినాల్లో కూడా ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అప్పుడు పరిశీలిస్తామని తెలిపారు.







కామెంట్లు (0)