శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పిఎన్‌‌బి ఫలితాలు ఆకర్షణీయం

1 గంట క్రితం

pnb
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 09:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- క్యూ2లో రూ.5,532 కోట్ల నికర లాభాలు

​న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌‌బి) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 సెప్టెంబర్‌‌తో ముగిసిన రెండో త్రైమాసికం(క్యూ2)లో 13 శాతం వృద్ధితో రూ.5,532 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.4,904 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.36,214 కోట్ల నుంచి రూ.38,185 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.31,872 కోట్ల నుంచి రూ.34,585 కోట్లకు చేరగా, నిర్వహణ లాభం రూ.7,227 కోట్ల నుంచి రూ.7,532 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్‌ శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది.

బ్యాంక్‌ మొండి బకాయిలు తగ్గుముఖం పట్టాయి. స్థూల నిరర్థక ఆస్తుల (జిఎన్‌‌పిఎ) నిష్పత్తి గతేడాది సెప్టెంబర్‌ నాటికి ఉన్న 3.45 శాతం నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరికి 2.55 శాతానికి తగ్గింది. నికర ఎన్‌పిఎలు 0.36 శాతం నుంచి 0.25 శాతానికి దిగివచ్చాయి. మొండి బకాయిలు, ఇతర అవసరాల కోసం కేటాయించిన ప్రొవిజన్లు రూ.643 కోట్ల నుంచి రూ.97 కోట్లకు తగ్గాయి. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 96.91 శాతం నుంచి 97.32 శాతానికి, మూలధన సమృద్ధి నిష్పత్తి 17.19 శాతం నుంచి 17.95 శాతానికి పెరిగినట్లు పిఎన్‌‌బి తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్