ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అనంతపురం గుల్జార్‌పేట వద్ద ఉద్రిక్తత

1 గంట క్రితం

tdp vs ycp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 05:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అనంతపురం జిల్లా : అనంతపురం గుల్జార్‌ పేట 20వ వార్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. టిడిపి నాయకులు గంటల కొద్ది బూత్‌లో ఉన్నారని వైసిపి శ్రేణులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసిపి శ్రేణులు ఒక్కసారిగా బూత్‌లోకి వెళ్లడంతో ఇరు గ్రూపుల మధ్య అల్లర్లు నెలకొన్నాయి. వైసిపి మహిళా నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇరు గ్రూపులను పోలీసులు పోలింగ్‌ కేంద్రం నుండి బయటకి పంపివేశారు. అలాగే పోలింగ్‌ కేంద్రం బయట ఉన్న వైసిపి, టిడిపి నేతలను పోలీసులు చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్