ప్రజాశక్తి చింతూరు : సిపిఎం పార్టీ అభ్యర్థులు జడ్పిటిసి మీడియం శ్రీదేవి ఎంపీటీసీ అభ్యర్థులు గెలుపు కోరుతూ ఆదివారం మండలంలోని వేగి తోట, కల్లేరు, అల్లివాగు, ఏడుగురాళ్లపల్లి, నారాయణపురం, తులుగొండ, మల్లె తోట, కుమ్మూరు,సెగ్మెంట్లలో సిపిఎం పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఎర్రజెండా విశిష్టతను ప్రజా పోరాటాలను ఓటర్లకు వివరించి ఓటు హక్కును సిపిఎం పార్టీ అభ్యర్థులకు వేయాలని అభ్యర్థించారు. పేదలకు ఎరిపే ధైర్యంగా గెలుపే లక్ష్యంగా ఎర్రజెండా సిపిఎం పార్టీ ప్రజా అండదండలు ఎప్పుడూ ఉంటాయని ప్రజల కోసం ప్రతినిత్యం పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఎం పార్టీ అని ప్రజలకు వివరిస్తూ వాగులు వంకలు దాటుతూ ఎర్రని ఎండలో ఎర్ర జెండాలు పట్టుకొని వాడవాడలా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచారంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పల్లపు వెంకట్, మాజీ జడ్పిటిసి ముర్రం రంగమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి వేక సారమ్మ, వేక రాజ్ కుమార్, పార్టీ మండల కమిటీ సభ్యులు కారం సుబ్బారావు, కోడేరు ఎంపీటీసీ అభ్యర్థి కారం నాగేశ్వరరావు, ఏడు రాళ్లపల్లి ఎంపీటీసీ అభ్యర్థి సవలం చంద్రిక, సవలం కన్నయ్య పాల్గొన్నారు.








కామెంట్లు (0)