చండీగఢ్ : పంజాబ్ ఎన్నికల కోసం పార్టీ విడుదల చేసిన మొదటి అభ్యర్థుల జాబితాతో ఆప్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు ఆదివారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పాటియాలా జిల్లాలోని సమానా నియోజకవర్గ ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరామజ్రా, సనౌర్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్మజ్రాలు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శనివారం పంజాబ్ ఎన్నికల కోసం ఆప్ 40 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, సమానా లేదా సనూర్ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ ఇంకా తన అభ్యర్థులను ప్రకటించలేదు. పఠాన్‌మజ్రా తన రాజీనామా లేఖను ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌కు పంపగా, చేతన్‌సింగ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించారు.
సమనా నియోజకవర్గంలో సెప్టెంబరులోనే ఆప్ పంజాబ్ మాజీ మంత్రి సుర్జిత్ సింగ్ రఖ్రాను నియోజకవర్గ (హల్కా) ఇన్‌చార్జిగా నియమించింది. సమానా నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా మిస్టర్ రాఖ్రా పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే పార్టీ నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు, సనౌర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్మజ్రా గతంలో సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. జిరక్‌పూర్‌కు చెందిన ఒక మహిళ చేసిన ఫిర్యాదు మేరకు, గత ఏడాది హర్మీత్ సింగ్‌పై అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు నుండి తప్పించుకున్న ఆయనను ఆరు నెలల అనంతరం ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్లో పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు మే నెలలో హర్మీత్ సింగ్‌కు సాధారణ బెయిలు మంజూరు చేసింది.







కామెంట్‌లు (0)