ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్నబ్‌ తుఫాను బాదితులను ఆదుకోవాలి: సిపిఎం

2 గంటల క్రితం

anakapalli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 05:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి _అనకాపల్లి :తుఫానుతో ఎరికిరెడ్డి పాలెం,అప్పన్నపాలెం గ్రామాల్లో బొప్పాయి,అరిటి నేలకు పడిపోయాయని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వీరిని ఆర్టికల్చర్ అధికారులు వెంటనే పంట నష్టం నమోదు చేసి నష్టపరిహారం అందించాలని సిపిఎం పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి గంగిరెడ్డి నారాయణమ్మ కోరారు.దుప్పుతురు,అచ్చుతాపురం ,మడుతురు,దోసూరు గ్రామాల్లో పర్యటించడం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అచ్యుతాపురం నుండి పూడిమడక వెళ్లే రోడ్డు పెద్ద గొయ్యిలు పడటంతో ప్రయాణికులు,విద్యార్థులు,వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే భారీ గుంతలను పూడ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని అధికారులను కోరారు.తుఫానుతో ఎరికిరెడ్డి పాలెం,అప్పన్నపాలెం గ్రామాల్లో బొప్పాయి,అరిటి పంటలు ద్వంసం అయ్యాయని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.వీరిని ఆర్టికల్చర్ అధికారులు వెంటనే పంట నష్టం నమోదు చేసి నష్టపరిహారం అందించాలని కోరారు.ప్రశ్నించే పోరాడేవారని జిల్లా పరిషత్ కు పంపిస్తే అచ్చుతాపురం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు .ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు కర్రీ అప్పారావు,అచ్చుతాపురం కన్వీనర్ ఆర్ రాము,సిపిఎం నాయకులు కడారి అప్పారావు ,ఆర్ లక్ష్మి,కె రామ సదాశివరావు,రాజు,చిట్టిబాబు,అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్