విశాఖ : విశాఖపట్నం జిల్లాలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కొత్తవలసకు చెందిన మల్ల ప్రవీణ్ కుమార్ కొంతకాలంగా జీవనోపాధి కోసం పెందుర్తి చింతల అగ్రహారంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ప్రవీణ్ ఆటో డ్రైవర్ కాగా, ఆయన భార్య కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాఖీ పండగ కావడంతో ప్రవీణ కుమార్ తన సోదరిలతో రాఖీలు కట్టించుకున్నారు. శుక్రవారం రాత్రి ప్రవీణ్ కుమార్ తన మొబైల్ నుంచి కుటుంబ సభ్యులకు ‘RIP’ అంటూ మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ భార్యతోపాటు ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి ... తర్వాత ప్రవీణ్ ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి తల్లి, ఇద్దరు పిల్లలను వెంటనే ఆస్పత్రికి తరలించారు.. కానీ అప్పటికే వారంతా చనిపోయినట్లు నిర్థారించారు. రాఖీ పండుగ రోజున కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన ప్రవీణ్ కుమార్ కుటుంబం వెంటనే ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పెందుర్తి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలు కారణమా ?.. ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖలో విషాదం - ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 29, 2026, 10:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)