సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘కింగ్ 100’ టైటిల్ గ్లింప్స్ విడుదల

29 ఆగస్టు, 2026

-1788005788430-7578.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 09:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కింగ్ నాగార్జున మైల్‌స్టోన్ 100వ చిత్రం ‘కింగ్ 100’ పేరుతో షూటింగ్ జరుపుకుంటోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో, రా కార్తీక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శనివారం (ఆగస్టు 29) నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. నాగార్జున వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమయ్యే గ్లింప్స్‌లో సమాజం మనుషులను వారి సంపద ఆధారంగా ఎలా విభజిస్తుందనే అంశాన్ని ఆసక్తికరంగా ప్రస్తావించారు. తన దగ్గర ఏమీ లేనప్పుడు తనను ‘లూజర్‌’ అని పిలిచారని, అదే సంపద సంపాదించిన తర్వాత ‘ది కింగ్‌’ అని పిలుస్తున్నారని నాగార్జున చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మరోవైపు నాగార్జున ఫొటోతో పాటు రూ.50 వేల కోట్ల భారీ స్కామ్‌కు సంబంధించిన వార్తను చూపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు.







ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్