ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి : సిఎం చంద్రబాబు

54 నిమిషాల క్రితం

Unanimous elections in panchayats should be encouraged CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 03:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : గ్రామాభివృద్ధికి ఉపయోగపడేలా పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని మంత్రులు, నేతలకు సిఎం చంద్రబాబు సూచించారు. ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, పంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవాల పై మంత్రులు, టిడిపి ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సిఎం మాట్లాడుతూ ... పుర, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి విజయం రెండున్నరేళ్ల పాలనకు దక్కిన గుర్తింపు అన్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయానికి అద్దం పట్టినట్లు అని చెప్పారు. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని అన్నారు. ఏకపక్షంగా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని గొడ్డలి పార్టీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. గ్రామాభివృద్ధికి ఉపయోగపడేలా పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మంత్రులు, నేతలకు సిఎం సూచించారు. 5 వేల లోపు జనాభా ఉంటే రూ.15 లక్షలు, 5-10 వేల మధ్య జనాభా ఉంటే రూ.25 లక్షలు, 10 వేలపైన జనాభా ఉంటే రూ.50 లక్షలు ఇచ్చే విషయాన్ని ప్రచారం చేయాలన్నారు. గతంలో కనిష్టంగా రూ.5 లక్షలుగా ఉన్న నజరానాను రూ.15 లక్షలు చేసినట్లు, గరిష్టంగా రూ.20 లక్షల ఉంటే ఇప్పుడు రూ.50 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. పార్టీలో నేతల మధ్య పంతాలు, ఈగోలు సరికాదని, అందరూ ఐక్యంగా పనిచేయాలని సిఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్