ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నాలుగో సారి ఏకగ్రీవంగా జాకేరు గ్రామ సర్పంచిగా బుద్ధ అప్పలనాయుడు ఎన్నిక

53 నిమిషాల క్రితం

Buddha Appalanaidu unanimously elected as Zakeru village sarpanch for the fourth time
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 03:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : వేపాడ మండలం జాకేరు గ్రామములో గ్రామ సర్పంచిగా పోటీ చేసి రెండు పర్యాయాలు బుద్ధ చిన్నమ్మలు సర్పంచి పదవిని కైవసం చేసుకోవడం జరిగింది. విధంగా మూడోసారి ఎస్సీ రిజర్వేషన్ కావడంతో బుద్ధ అప్పలనాయుడు ఎస్సీ అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించి వైయస్ సర్పంచ్ గా అప్పలనాయుడు అను పొందారు ప్రస్తుతం నాలుగో సారి ఏకగ్రీవంగా బుద్ధ అప్పలనాయుడు ని ఎన్నుకోవడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు గ్రామం అభివృద్ధి ప్రధాన లక్ష్యం. పార్టీలకు అతీతంగా గ్రామములో ప్రజలందరినీ కలుపుకొని గ్రామములో సమస్యలు పరిష్కారం కృషి చేయడం నా ప్రధాన ధ్యేయం. ప్రధానంగా గ్రామములో నిరుపేద కుటుంబాలకు ఏ అవసరం వచ్చినా నా సాయి శక్తుల వారికి ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవడంలో నేను ఎప్పుడూ ముందు ఉంటాను అప్పుడు ఇప్పుడు కూడా నా లక్ష్యం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం యువతకు . విద్యార్థులకు చదువుకొనుటకు ఆర్థికంగా సహకరించడమే నేడు ఏకగ్రీవానికి అవకాశం కల్పించిన గ్రామ పెద్దలకు ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని గ్రామాన్ని అభివృద్ధి చేయుటకు నా సాయి శక్తుల ప్రభుత్వ నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తారని ఆయన తెలిపారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్