ప్రజాశక్తి-మందస, పలాస (శ్రీకాకుళం) : ఒడిశా, ఆంధ్ర సరిహద్దులో ఉన్న గిరిజన గ్రామాల ఓటర్లను పంచాయతీ ఎన్నికలలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే మోహన్ రావు, యన్. గణపతి , గిరిజన సంఘం నాయకులు సవర గురునాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్ర- ఒరిస్సా సరిహద్దుల్లో మందస మండలం మాణిక్య పట్నం, మధ్య కళ్ళు, గుడ్డి కోలా, దా లసరి ,కొండమేర గ్రామాల్లో ఆదివారం పర్యటించి గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయా గ్రామాల గిరిజనులు పంచాయితీ వార్డు మెంబర్లుగా పోటీలో ఉన్న వారిని తప్పుకోవాలని ఒరిస్సా అధికారులు, పోలీసులు ఆయా గ్రామాలలో తిరుగుతూ మాణిక్యపట్నం గ్రామానికి చెందిన సవర విప్రో, బిత్తరబంధ గ్రామానికి చెందిన సవర జిత్తు, మధ్య కళ్ళుగ్రామానికి చెందిన సవర.లక్ష్మి లను అదుపులోకి తీసుకొన్నారు. వీరిలో సవర జిత్తు, సవర.లక్ష్మిలను పోటీల నుండి బలవంతంగా ఉపసంహరించుకునే విధంగా చేయగా విప్రో తప్పించుకున్నారు. ఈ విధంగా ఒరిస్సా అధికారులు ప్రజల ప్రాథమిక హక్కుల పై దాడులు చేయడం భయభ్రాంతులకు గురి చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూందన్నారు. గత కొంతకాలంగా ఈ సమస్య కొనసాగుతున్న అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు. గిరిజనుల ఓటు హక్కుతో పాటు వారి పోడు భూములను, చెరువులను, స్మశాన వాటికలను, ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూములను కూడా ఒరిస్సా అధికారులు ఆక్రమించు కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో ఒడిషా రాష్ట్రం అధికారులు ఇబ్బందులు పెడుతున్నా ఎపి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు కలుగజేసుకొని ఈ పంచాయతీ ఎన్నికలలో పోటీలో ఉన్న సరిహద్దు గ్రామాల అభ్యర్థులకు రక్షణ కల్పించి ,గిరిజనుల ఓట్లను స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒరిస్సా అధికారులతో సంప్రదింపులు జరిపి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సవర .రాము, సవర .జగన్నాథం, సవర. జయచంద్ర, సవర. గణేష్, సవర, బుగతో, రాము, సవర. సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్చగా ఓటు హక్కు కల్పించాలి
14 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 22, 2026, 04:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)