ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బంగ్లాదేశ్‌లో హింసాకాండ .. అవామీ లీగ్ నేతల ఇళ్లకు నిప్పు

8 నిమిషాల క్రితం

Bangladesh .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 04:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఢాకా : బంగ్లాదేశ్‌లో హింసాకాండ తీవ్రరూపం దాల్చింది. నరైల్‌ జిల్లాలో అవామీ లీగ్‌ నాయకులు, కార్యకర్తలకు చెందిన ఆస్తులపై దాడులు జరిగాయి. సుమారు 30 ఇళ్లకు నిప్పు పెట్టినట్లు స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. పలు ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేయడంతో పాటు దోచుకున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.

వివరాల ప్రకారం.. కాలియా ఉపజిల్లాలోని బెందర్‌చార్‌ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం నుండి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. అవామీ లీగ్‌ మాజీ ఎమ్మెల్యే బి.ఎం. కబీరుల్‌ హక్‌ ముక్తి, కాలియా మున్సిపాలిటీ మాజీ మేయర్‌ ముష్ఫికుర్‌ రెహమాన్‌ లిటన్‌, స్థానిక పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణపాద ఘోష్‌ల నివాసాలపై దాడులు జరిగాయి. గ్రామానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 50 ఇళ్లు, దుకాణాలు ధ్వంసమైనట్లు, దోపిడీకి గురైనట్లు ప్థానిక మీడియా తెలిపింది. ఈ దాడుల వెనుక అధికార బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బిఎన్‌పి) మద్దతుదారులు ఉన్నారని పేర్కొంది. మాజీ ఎమ్మెల్యే ఇంటితో సహా పలు ఇళ్లను ధ్వంసం చేశారని, ఐదు నుండి ఆరు ఇళ్లకు నిప్పు పెట్టారని కాలియా ఉపజిల్లా కార్యనిర్వాహక అధికారి మహ్మద్‌ జిన్నతుల్‌ ఇస్లాం పేర్కొన్నారు. అయితే దాడులకు బాధ్యులెవరన్నది ఇంకా నిర్ధారణ కాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. నవంబర్‌ 18న బిఎన్‌పి మోటార్‌సైకిళ్ల ర్యాలీపై జరిగిన దాడిలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో మృతుల కుటుంబసభ్యులు, మద్దతుదారులు అవామీలీగ్‌ నేతలు, కార్యకర్తల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నట్లు నరైల్‌ జిల్లా పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చామని, అదనపు బలగాలను మోహరించామని వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్