మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

14 వరకు నవీకరించిన ఓటర్ల జాబితాయే..

10 గంటల క్రితం

గిరిజన యువకుడికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు తీర్పు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 09:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు రద్దు

ప్రజాశక్తి-అమరావతి : 2026 జులై 15 వరకు నవీకరించిన ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకునేలా అధికారులకు స్పష్టమైన, ఏకరూప ఆదేశాలు జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ఓటర్ల తుది జాబితాను పరిగణనలోకి తీసుకునే విషయంలో ఎప్పటికప్పుడు జారీ చేసిన సర్క్యులర్ల ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ ఆలపాటి గిరిధర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు, సవరణల కోసం 2026 ఆగస్టు 31 వరకు అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం స్థానిక సంస్థల తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని కోరుతూ తామిచ్చిన వినతిపత్రాన్ని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోలేదని హైకోర్టును వైసిపి ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి, జులై 15 వరకు నవీకరించిన ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని ఈ నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అశ్వినీకుమార్‌ వాదనలు వినిపిస్తూ, సింగిల్‌ జడ్జి ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఈ నెల 14 వరకు నవీకరించిన ఓటర్ల జాబితాను అందించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరిందని, ఓటర్ల జాబితా విషయంలో తమ సర్క్యులర్ల ఆధారంగానే ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్