ప్రజాశక్తి- చిత్తూరు : గ్రామీణ ప్రాంతంలో ఓటరుగా నమోదు కాకపోవడంతో యాదమరి మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా కే. పుష్పావతి దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జెడ్పీటీసీ నామినేషన్ల తిరస్కరణపై వచ్చిన అప్పీళ్లను ఆయన పరిశీలించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, చిత్తూరు జిల్లాలోని 27 మండలాల పరిధిలో గ్రామీణ ప్రాంత ఓటరుగా ఆమె పేరు నమోదు కాకపోవడంతో నామినేషన్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జడ్పీ పీఆర్వో రవికుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఓటరుగా నమోదు కాకపోవడంతోనే నామినేషన్ తిరస్కరించాం
59 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 25, 2026, 01:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)