ఆరుగురు చిన్నారులు సహా 12 మందికి గాయాలు
టల్లాహాసీ : అమెరికాలోని ఫ్లోరిడాలో కాల్పులు కలకలం సృష్టించాయి. టల్లాహాసీలోని ఫుట్‌బాల్ స్టేడియం సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు సహా 12 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఏ&ఎం యూనివర్శిటీ హోమ్‌కమింగ్ వేడుకల వారాంతంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసిన అనంతరం రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులకు ముందు అక్కడ ఘర్షణ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని టల్లాహాసీ పోలీస్ చీఫ్ లారెన్స్ రెవెల్ శనివారం వెల్లడించారు. బాధితుల్లో 12 మందికి తుపాకీ గాయాలయ్యాయని, వారిలో కనీసం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. యూనివర్శిటీ ప్రాంగణం సురక్షితంగానే ఉందని యాజమాన్యం తెలిపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.







కామెంట్‌లు (0)