ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్ (కృష్ణా) : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో, ప్రత్యేక ఎన్నికల విధుల నిర్వహణ నుంచి దివ్యాంగ ఉద్యోగులను మినహాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు జె లక్ష్మణ్, ఉపాధ్యక్షులు నాగనబోయిన సత్యనారాయణ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ చోడే వీర వెంకట సత్య బాపిరాజును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం టౌన్ అధ్యక్షులు ఎం నాగబాబు పాల్గొన్నారు.
ఎన్నికల విధుల నుంచి దివ్యాంగులకు మినహాయింపు ఇవ్వండి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 25, 2026, 01:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)