ప్రజాశక్తి - వేటపాలెం : మురసు తుఫాను దెబ్బకు చిన్నాభిన్నమైన విద్యుత్ సరఫరా వ్యవస్థ రోజులు గడుస్తున్నా ఇంకా గాడిన పడలేదు. గృహావసరాలు, ఆక్వా రంగానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చి మరమ్మత్తులు చేస్తున్నారు. పదిరోజులైనా ఇంకా కొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే వరదముంపు నుంచి బయటపడ్డ వరి పొలాల్లో సస్యరక్షణ పనులు చేసేందుకు నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రొంపెరు వాగు నీటిని ఎత్తిపోతల ద్వారా సాగుచేసే వారాట పొలాల్లో చాలా భాగం వరద ముంపుకు గురై బయటపడింది. ఈ ప్రాంతంలో తుఫాను గాలులకు కరెంటు స్తంభాలు విరిగి, తీగలు తెగిపడి, ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. వరదనీరు తగ్గిన పొలాల్లో వరి పైరును కాపాడుకునేందుకు నీరు అందుబాటులో లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ముంపు నుంచి బయట పడిన పైరుకు ఎరువులు, పురుగుమందులు అందించి కాపాడుకోవాలని పరుగులు పెడుతున్నారు. కానీ నీరు అందుబాటులో లేకపోవడంతో విద్యుత్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు స్పందించి వ్యవసాయ విద్యుత్ సరఫరా సత్వరం పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.
వ్యవసాయ విద్యుత్ సరఫరా ఎప్పటికో...?
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026, 04:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)