గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

U-19 Asia Cup: ఫైనల్‌కు భారత్‌

1 గంట క్రితం

ind u19.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 05:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సెమీస్‌లో అఫ్గానిస్థాన్‌పై 8 వికెట్ల ఘన విజయం..

  • ఫైనల్లో పాకిస్థాన్‌తో అమీతుమీ

అండర్‌-19 ఆసియా కప్‌ క్రికెట్‌ టోర్నీలో భారత యువ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌పై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో భారత్‌ 36.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. దీంతో ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఎల్లుండి జరిగే ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌ జట్టు భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 227 పరుగులు చేసింది. ఓపెనర్లు అబీదుల్లా నదార్జన్‌ (14), ఫరీదుల్లా ఇన్హాస్‌ (13) నిరాశపరిచారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సుభాన్‌ జఖైల్‌ 31 పరుగులు చేశాడు. వికెట్‌ కీపర్‌ నొమన్‌ సలార్జాయ్‌ (51), షా ఫైసల్‌ రహీమీ (51) అర్ధశతకాలతో రాణించగా, కెప్టెన్‌ సొహైల్‌ 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో ఇషాన్‌ సూద్‌ మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆర్యన్‌ సస్వాని రెండు వికెట్లు పడగొట్టగా, కావ్యా పటేల్‌, యశ్‌వర్దన్‌ చౌహాన్‌, అర్జున్‌ రాజ్‌పుత్‌ తలో వికెట్‌ సాధించారు.

లక్ష్య మెరుపులు

228 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు కెప్టెన్‌ లక్ష్య రాయ్‌ చందాని, ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ శుభారంభం అందించారు. ఇద్దరూ అర్ధశతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. లక్ష్య 93 పరుగులు చేయగా, ఆర్యవీర్‌ 51 పరుగులు సాధించాడు. అనంతరం వీకే వినీత్‌ అజేయంగా 57 పరుగులు చేయగా, యశ్‌వర్దన్‌ చౌహాన్‌ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్‌ 36.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు చేరుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్