ప్రజాశక్తి - ఆలమూరు : గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026 నిర్వహణ ప్రక్రియలో భాగంగా ఆలమూరు మండల ప్రజా పరిషత్, విద్య వనరుల శాఖ కార్యాలయాలలో గురువారం ఎన్నికల విధులపై ఆర్ఓలు, గ్రామ అధికారులకు ఎంపీడీవో ఏ.రాజు ఆధ్వర్యంలో ఎంఓటి ఏ.శ్రీనివాసరావు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం స్టేజ్–1 రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓలు) ఏడుగురుకి శిక్షణ అందించారు. అనంతరం మధ్యాహ్నం స్టేజ్–2లో 20 మంది రిటర్నింగ్ అధికారులతో పాటు 18 మంది గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలు, అధికారుల బాధ్యతలు, ఎన్నికల ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు, విధుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులను సన్నద్ధం చేసే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీడీవో రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏవో మెహర్ ప్రకాష్, ఎంఈఓ లు అప్పాజీ, రాజు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ సతీష్, కంప్యూటర్ ఆపరేటర్ వలీ, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్ఓలు, గ్రామాధికారులకు శిక్షణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026, 05:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)