గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పేద విద్యార్థులకు మణికర్ణిక ద్వారా సహాయం

1 గంట క్రితం

kakinada-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 05:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - జగ్గంపేట : ఇద్దరు పేద విద్యార్ధినిలకు చదువుకు రంగంపేట ఎంఈఓ 2 మధుసూధన్ గురువారం మణికర్ణక టీమ్ ద్వారా సహాయాన్ని అందించారు. పేద విద్యార్థినుల ఉన్నత విద్యకు చేయూతనందించేందుకు మణికర్ణిక టీమ్ విద్యాంజలి కార్యక్రమం నిర్వహిస్తుంది. దానిలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ధనలక్ష్మి, మణిదీపిక అనే ఇద్దరు విద్యార్థినులకు కళాశాల ఫీజులు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఆ టీమ్ ద్వారా సహాయాన్ని అందించారు. ఆ రూ.5 వేల నగదును వైస్ ప్రిన్సిపల్ సి హెచ్ బాలరాజుకు అందజేశారు. సహాయానికి సహకరించిన మణికర్ణిక టీమ్ కు విద్యార్ధులు తల్లి తండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సత్యలత, టీం మణికర్ణిక సభ్యులు రాజేష్, రమేష్, వీరబాబు, జి. ప్రసాద్, పి. ప్రసాద్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్