ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెత్తకుప్పలో జెడ్‌‌పిటిసి బ్యాలెట్ పేపర్లు

1 గంట క్రితం

చెత్తకుప్పలో జెడ్‌‌పిటిసి బ్యాలెట్ పేపర్లు
- ఎమ్మిగనూరు కౌంటింగ్ కేంద్రం వద్ద 50 బ్యాలెట్ పత్రాలు లభ్యం
- విచారణ జరిపించాలని వైసిపి నేత రాజీవ్ రెడ్డి డిమాండ్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 11:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎమ్మిగనూరు కౌంటింగ్ కేంద్రం వద్ద 50 బ్యాలెట్ పత్రాలు లభ్యం

- విచారణ జరిపించాలని వైసిపి నేత రాజీవ్ రెడ్డి డిమాండ్

ప్రజాశక్తి – ఎమ్మిగనూరు (కర్నూలు జిల్లా) : కర్నూలు జల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద గోనెగండ్ల జెడ్‌‌పిటిసి ఎన్నికలకు సంబంధించిన సుమారు 50 బ్యాలెట్ పేపర్లు చెత్తకుప్పలో లభించడం ఆదివారం కలకలం రేపింది. ఎమ్మిగనూరు జూనియర్‌ కళాశాల కౌంటింగ్‌ హాల్‌ వద్ద చెత్త కుప్పలో ఇవి దొరికాయి. సమాచారం అందుకున్న వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని, అధికారుల సంతకాలు, ఎన్నికల సీల్స్ ఉన్న బ్యాలెట్ పత్రాలను ఆయన మీడియాకు చూపించారు. వైసిపి అభ్యర్థి జహంగీర్‌కు చెందిన ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసిన బ్యాలెట్ పత్రాలున్నాయన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం భద్రపరచాల్సిన బ్యాలెట్ పత్రాలు చెత్తకుప్పలోకి ఎలా చేరాయని ప్రశ్నించారు. గోనెగండ్ల జెడ్‌‌పిటిసి కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయన్న తమ అనుమానాలకు ఈ ఘటన మరింత బలం చేకూరుస్తోందన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి రీకౌంటింగ్ కోసం న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్