ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రసవత్తరం...

14 నిమిషాల క్రితం

cricket
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 12:07 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- ఇన్నింగ్స్‌ విజయంపై భారత్‌ గురి

- డ్రా కోసం ఆతిథ్య జట్టు పోరాటం

- రిషబ్‌ పంత్‌ ధనాధన్‌ సెంచరీతో టీమిండియా రికార్డు స్కోరు

- కివీస్‌‌తో తొలి టెస్టు నాల్గో రోజు ఆట

వెల్లింగ్టన్‌ : భారత్‌, న్యూజిలాండ్‌ క్రికెట్‌ ‌జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. భారత తొలి ఇన్నింగ్స్‌‌లో బ్యాటర్లు రిషబ్‌ పంత్‌ (128), ధ్రువ్‌ జురెల్‌ (78) ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో మోత మోగించారు. దీంతో భారత్‌ 720/9 పరుగుల వద్ద డిక్లరేషన్‌ ఇచ్చింది. బౌలర్లు మెరవటంతో న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అప్పుడే రెండు వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్‌ భారత్‌ ‌కంటే 233 పరుగుల వెనుకంజలో నిలువగా.. ఇన్నింగ్స్‌ విజయంపై టీమ్‌ ఇండియా కన్నేసింది. సోమవారం ఉదయం సెషన్లో పేసర్లు మెరిస్తే న్యూజిలాండ్‌ గడ్డపై సుదీర్ఘ విరామం తర్వాత తొలి టెస్టు మ్యాచ్‌ విజయం భారత్‌కు ఖాయమే!.

ఆదివారం ఆటలో రిషబ్‌ పంత్‌ (128, 153 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగాడు. ధ్రువ్‌ జురెల్‌ (78, 79 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) సైతం దంచికొట్టాడు. దీనికి ముందు ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ (136), కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (98), దేవదత్‌ పడిక్కల్‌ (80), యశస్వి జైస్వాల్‌ (85) సైతం రెచ్చిపోవటంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 166 ఓవర్లలో 9 వికెట్లకు 720 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 352 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న భారత్.. ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్‌ ప్రకటించి ఆతిథ్య న్యూజిలాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రప్పించింది. న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో నాల్గో రోజైన ఆదివారం ఆట ముగిసే సరికి 45 ఓవర్లలో 2 వికెట్లకు 119 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు మరో 233 పరుగుల వెనుకంజలో నిలిచింది. సోమవారమే ఆఖరు రోజు. దీంతో ఫలితంపై ఇరు జట్లలోనూ ఉత్కంఠ నెలకొంది.

న్యూజిలాండ్‌ ‌రెండో ఇన్నింగ్స్‌‌లో టామ్‌ లేథమ్‌ (0)ను ఇన్నింగ్స్‌ రెండో బంతితో అవుట్‌ చేసిన బుమ్రా..భారత్‌కు బ్రేక్‌ అందించాడు. మరో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (59 నాటౌట్‌, 137 బంతుల్లో 6 ఫోర్లు) ఆచితూచి ఆడాడు. అజేయ అర్థ సెంచరీతో న్యూజిలాండ్‌ భారాన్ని మోస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ సాధించిన హెన్రీ నికోల్స్‌ (31, 59 బంతుల్లో 3 ఫోర్లు)ను ప్రసిద్‌ కృష్ణ సాగనంపాడు. దీంతో 60 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. రచిన్‌ రవీంద్ర (27 నాటౌట్‌, 72 బంతుల్లో 3 ఫోర్లు), డెవాన్ కాన్వే నాల్గో రోజు ఆటలో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. న్యూజిలాండ్‌‌కు ఆఖరు రోజు ఆటలో 8 వికెట్లు కాపాడుకోవటంతో పాటు 233 పరుగుల కంటే ఎక్కువ చేయటం అతిపెద్ద సవాల్‌. ఆదివారం ముందుగా రిషబ్ పంత్‌ (128), ధ్రువ్‌ జురెల్‌ (78) మెరుపులతో టీమ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. విదేశీ టెస్టుల్లో న్యూజిలాండ్‌ గడ్డపైనే ఇప్పటివరకు సెంచరీ చేయని రిషబ్‌ పంత్‌... వెల్లింగ్టన్‌ టెస్టులో ఆ ఘనతా సొంతం చేసుకున్నాడు. తనదైన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో విరుచుకుపడిన రిషబ్‌ పంత్‌ ఆరంభంలో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాడు. 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 135 బంతుల్లోనే పంత్‌ సెంచరీ బాదాడు. ధ్రువ్‌ జురెల్‌ సైతం ధనాధన్‌ షోతో మెప్పించాడు. ఐదు ఫోర్లతో 61 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన జురెల్‌ న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌కు అత్యధిక టెస్టు మ్యాచ్‌ స్కోరు అందించాడు. జురెల్‌ సెంచరీ కోసం ఎదురుచూసిన గిల్‌.. అతడు అవుట్‌ కాగానే ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్‌ ప్రకటించాడు. అన్షుల్‌ కాంబోజ్‌ (38), వాషింగ్టన్‌ సుందర్‌ (24), ఆకాశ్‌ దీప్‌ (13) సైతం ఆకట్టుకునే ఇన్నింగ్స్‌లు ఆడారు. కివీస్‌ బౌలర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌ (3/154), రచిన్‌ రవీంద్ర (2/44) వికెట్లు పడగొట్టారు.

స్కోరు వివరాలు :

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 368/10

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ (సి) బ్లండెల్‌ (బి) హెన్రీ 85, రాహుల్‌ (బి) స్మిత్‌ 136, పడిక్కల్‌ (బి) జెమీసన్‌ 80, శుభ్‌మన్‌ గిల్‌ (బి) డఫ్ఫీ 98, రిషబ్‌ పంత్‌ (సి) స్మిత్‌ (బి) రచిన్‌ 128, అన్షుల్‌ కాంబోజ్‌ (సి) కాన్వే (బి) ఫిలిప్ప్‌ 38, జురెల్‌ (స్టంప్డ్‌) బ్లండెల్‌ (బి) ఫిలిప్స్‌ 78, వాషింగ్టన్‌ సుందర్‌ (సి,బి) రచిన్‌ 24, ఆకాశ్‌ దీప్‌ (సి) లేథమ్‌ (బి) ఫిలిప్స్‌ 13, బుమ్రా నాటౌట్ 7, ఎక్స్‌ట్రాలు : 33, మొత్తం : (166 ఓవర్లలో 9 వికెట్లకు) 720 డిక్లేర్డ్‌.

వికెట్ల పతనం : 1-130, 2-295, 3-386, 4-486, 5-554, 6-629, 7-683, 8-696, 9-720.

బౌలింగ్‌ : మాట్ హెన్రీ 33-7-94-1, కైల్‌ జెమీసన్‌ 31-6-88-1, జాకడ్‌ డఫ్ఫీ 33-1-201-1, నాథన్‌ స్మిత్‌ 29-4-84-1, గ్లెన్ ఫిలిప్స్‌ 24-0-154-3, రచిన్‌ రవీంద్ర 10-0-44-2, డార్లీ మిచెల్‌ 6-0-39-0.

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : టామ్‌ లేథమ్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 0, డెవాన్‌ కాన్వే నాటౌట్‌ 59, హెన్రీ నికోల్స్‌ (సి) జురెల్‌ (బి) ప్రసిద్‌ 31, రచిన్‌ రవీంద్ర నాటౌట్‌ 27, ఎక్స్‌ట్రాలు : 2, మొత్తం : (45 ఓవర్లలో 2 వికెట్లకు) 119.

వికెట్ల పతనం : 1-0, 2-60.

బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 9-1-33-1, ఆకాశ్‌ దీప్‌ 10-2-25-0, అన్షుల్‌ కాంబోజ్‌ 9--21-0, ప్రసిద్‌ కృష్ణ 8-2-20-1, వాషింగ్టన్‌ సుందర్‌ 8-2-16-0, దేవదత్‌ పడిక్కల్‌ 1-0-2-0.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్