శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళా సచివాలయ ఉద్యోగుల నిర్బంధం

2 గంటల క్రితం

sachivalayam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 11:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): తమ డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడకు పిలుపుచ్చిన స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులను పోలీసులు అడుగడుగునా నిర్బంధిస్తున్నారు. శనివారం రాత్రి 8:30 గంటల సమయంలో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 6వ వార్డు లో సంక్షేమ కార్యదర్శి అమరావతిని, 26వ వార్డు సంక్షేమ కార్యదర్శి రజనీకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకొని నిర్బంధించారని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు యూనియన్ నాయకుడు కోటేశ్వరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. న్యాయమైన తమ డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడకు పిలుపు ఇచ్చామని, కానీ రాత్రిళ్ళు మహిళలను పోలీస్ స్టేషన్‌‌లో నిర్భందించడం సమంజసం కాదని, వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్