మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉద్యోగ ‌భద్రతపై భరోసా ఇవ్వలేము

19 నిమిషాల క్రితం

image-cmwkt4sd2gt140js0p87zwsf2.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 11:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మైక్రోసాఫ్ట్‌ సిఇఒ సత్య నాదెళ్ల

శాన్‌‌ఫ్రాన్సిస్కో : మైక్రోసాఫ్ట్‌లో రాబోయే సంవత్సరాల్లో ఉద్యోగాల స్వరూపం, పని విధానాలు మారనున్నాయని, సంస్థలో ఉద్యోగుల భవిష్యత్తు భద్రతపై భరోసా ఇవ్వలేమని ఆ కంపెనీ సిఇఒ సత్య నాదెళ్ల తెలిపారు. ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌, అమెరికా, బ్రిటన్‌, కెనడాల్లోని ఉద్యోగుల కోసం ప్రకటించిన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (విఆర్‌ఎస్‌) ఉద్దేశాన్ని ‌తెలిపారు. సంస్థాగత మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు తమ కెరీర్‌, దీర్ఘకాలిక ఆర్థిక అవకాశాలకు తగిన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్‌లోనే కాకుండా ఇతర సంస్థల్లోనూ విలువైనవిగా నిలిచే నైపుణ్యాలను ఉద్యోగులు అభివృద్ధి చేసుకోవాలని కంపెనీ కోరుకుంటోందన్నారు. రానున్న మార్పులకు అనుగుణంగా టీమ్‌ల పరిమాణం, పని ప్రవాహం, ఉద్యోగుల నిర్వహణ విధానాలను మార్చాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు కొత్త అవకాశాల కల్పన, ఉద్యోగుల వృత్తిపరమైన ఎదుగుదలకు అవసరమైన శిక్షణపై దృష్టి పెడతామని తెలిపారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌కు సుమారు 23 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. విఆర్‌ఎస్‌‌కు అర్హులైన ఉద్యోగులు తమ నిర్ణయాన్ని తెలియజేసేందుకు డిసెంబరు 1 వరకు గడువు ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్