భారత్‌లో పునరుత్పాదక ఇంధనంపై వ్యయం
న్యూఢిల్లీ : భారత్‌లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై 2030 నాటికి అదనంగా 7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది. దీంతో దేశంలో సంస్థ మొత్తం పెట్టుబడి నిబద్ధత 55 బిలియన్ డాలర్లకు చేరనుందని తెలిపింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 934 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టనుంది. ఈ పెట్టుబడులు భారత ఇంధన భద్రతను బలోపేతం చేస్తాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. 2040 నాటికి నెట్‌జీరో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవి దోహదపడతాయని అమెజాన్ సిఎస్‌ఒ కారా హర్స్ట్ తెలిపారు.







కామెంట్‌లు (0)