మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరూ.ఏడు కోట్ల వసూలులో సూత్రధారులు ఎవరు?

11 నిమిషాల క్రితం

CBI raids vigilance office in Punjab’s Mohali
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 11:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నిరుద్యోగులను మోసం చేసిన కేసు సిఐడికి అప్పగింత

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : నిరుద్యోగుల నుంచి జనసేన నేతల పేరుతో రూ.ఏడు కోట్లు వసూళ్ల చేసిన కేసును ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ కేసులో 36 మంది నిరుద్యోగుల నుంచి డబ్బు వసూళ్ల కేసులో బోడపాటి ధరణి కృష్ణ, పెద్దిరాజుపై మంగళగిరి రూరల్ పోలీసులు రెండు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. 36 మందిని మోసం చేసిన ఈ వ్యవహారంపై జరిగిన ఆర్థిక లావాదేవీల్లో పోలీసులకు కొన్ని కీలకమైన ఆధారాలు లభ్యమైనట్టు తెలిసింది. ఆర్థిక వ్యవహారాల్లో బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ అయిన అంశం వెలుగులోకి రావడంతో ఈ కేసును మంగళగిరి రూరల్‌ ‌పోలీసుల నుంచి సిఐడికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 36 మంది నిందితుల్లో కొంత మంది ధరణి కృష్ణ ఇచ్చిన నంబర్లకు పెద్ద మొత్తంలో సొమ్ము చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సంబంధిత నిందితులలో జనసేనలో గుంటూరు జిల్లాకు చెందిన కీలకమైన నాయకులున్నారని తెలియడంతో సిఐడికి అప్పగించారని కూడా చెబుతున్నారు. మంగళగిరి రూరల్‌ పోలీసుల విచారణ తర్వాత ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ధరణికృష్ణ మీడియాకు కొన్ని వీడియోలు పంపారు. జనసేన నేత కె.శ్రీనివాసరావు (కెకె)తో తనకు ప్రాణహాని ఉందన్న ధరణికృష్ణ.. తనకేం జరిగినా మంగళగిరి రూరల్ సిఐ వెంకట్ చౌదరి, ఎస్‌ఐ రవితేజలదే బాధ్యత అన్నారు. ఈ వ్యవహారంలో జనసేన ప్రధాన కార్యాలయంలో కీలకనేతల భాగస్వామ్యం ఉప ముఖ్యమంత్రి పవన్‌ ‌కల్యాణ్‌ ‌దృష్టికి చేరడంతో వారు తమపై కేసులు పెట్టి తప్పించుకోవడానికి చూస్తున్నారని ధరణి కృష్ణ ఆరోపించారు. ఈ కేసులో తమను పాత్రధారులుగా చూపినా అసలు సూత్రధారులను పోలీసు అధికారులు రక్షిస్తున్నారని ఆమె తెలిపారు. ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్‌‌కు ఎన్నికలు జరుగుతున్నందున మంగళగిరి పోలీసులపై రాజకీయ వత్తిడి తెస్తే ప్రత్యర్థులు టిడిపి కూటమి పార్టీలపై వ్యతిరేక ప్రచారం చేసే అవకాశం ఉండటంతో సిఐడికి అప్పగించారని కూడా కూటమి నాయకులే పరోక్షంగా అంగీకరిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్