బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కన్నీటితో సచివాలయ ఉద్యోగుల నేత హెచ్చరిక

1 గంట క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 12:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆ సంఘం నేత మధుబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యోగులపై నమోదైన కేసులు, సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ కంటతడి పెట్టారు. ఈ మేరకు ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఉద్యమ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్టోబర్‌ 2లోపు కేసులు, సస్పెన్షన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మధుబాబు డెడ్‌లైన్‌ విధించారు. అప్పటిలోగా సమస్య పరిష్కారం కాకపోతే అక్టోబర్‌ 3 నుంచి శ్రీకాకుళంలో ఒంటరిగానే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. ఉద్యోగుల హక్కుల కోసం తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు.

కాగా, సెప్టెంబర్‌ 27న విజయవాడలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న ఉద్యోగుల వివరాలను సేకరించి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని అధికారులు జిల్లాలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రెండేళ్లుగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతోనే నిరసన చేపట్టామని ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు. నిరసనలో పాల్గొన్న ఉద్యోగులపై కేసులు, సస్పెన్షన్లు విధించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్