జై పంగులూరు (ప్రకాశం) : ప్రకాశం జిల్లా జై పంగులూరు మండలం నూజిల్లపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం జరుగుతున్న పోరాటం ఉధృత రూపం దాల్చింది. శుక్రవారం మండలంలోని దళితులందరూ కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వో ఆఫీసును ముట్టడించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అంగీకరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.








కామెంట్‌లు (0)