mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలుగు రాష్ట్రాల్లో 1/70 చట్టం ఉల్లంఘన

2 గంటల క్రితం

girijana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 09:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్‌ ‌కన్వీనర్‌ బాబూరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో 1/70 చట్టం అమల్లో తీవ్ర ఉల్లంఘన జరుగుతోందని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కన్వీనర్, మాజీ ఎంపి ఏం బాబురావు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ఆంధ్రలోని టిడిపి కూటమి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. వడ్డేశ్వరంలో గిరిజన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా శనివారం ఆయన హాజరై మాట్లాడారు.

1/70 చట్టం అధికారాలను తొలగించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌‌పై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వైఖరి ఏమిటో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం కింద గిరిజనేతరులకు భూమి క్రయ, విక్రయాలు, లీజు ,నిషేధం విధిస్తున్న సెక్షన్ 3 (1)సి ను తొలగించాలని సుప్రీంకోర్టులో 1700 మంది గిరిజనేతరులు కేసు దాఖలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

1/70 చట్టం పరిరక్షణకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో తక్షణమే ఇంప్లిడ్ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. తెలుగు రాష్ట్రాల ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో 1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో ఇంప్లిడ్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్‌‌లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఆదివాసీ ప్రజల చట్టం పరిరక్షణకు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లోసురేంద్ర , సహాయ కార్యదర్శి ఎ, అశోక్, రాష్ట్ర కమిటి సభ్యులు కె నర్సయ్య ఎన్ అప్పన్న, సిరిమల్లి రెడ్డి తదితరులు పాల్గొన్నారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్