శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Transfers - ఎపి లో IAS అధికారుల బదిలీలు.. పోస్టింగ్ లు ...!

1 గంట క్రితం

Transfers and postings of IAS officers in AP...!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 12:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. మొత్తం 22 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ, కొత్త పోస్టింగ్‌లను కేటాయించింది. పర్యాటకం, పాఠశాల విద్య, రవాణా, ఆరోగ్యం, హౌసింగ్, టీటీడీ, వీఎమ్ఆర్‌డీఏ, ఏపీ టూరిజం తదితర కీలక శాఖల్లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. IAS అధికారుల బదిలీలు, పోస్టింగ్స్ ‌పై ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఎపి లో IAS అధికారుల బదిలీలు అండ్ పోస్టింగ్స్ .....


ఎస్ ఎస్. రావత్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ.


జె. శ్యామలరావు – పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ.


కోనా శశిధర్ – రవాణా, రోడ్లు–భవనాల శాఖ కార్యదర్శిగా నియామకం.


ఎం. శివ ప్రసాద్, IFS – ఏపీఎస్‌ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ.


అమ్రపాలి కాటా – ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్; తదుపరి పోస్టింగ్ కోసం GADకు రిపోర్ట్ చేయాలని ఆదేశం.


పట్టంశెట్టి రవి సుభాష్ – ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం; APPSCలో CEO, సెక్రటరీ పోస్టులకు FAC బాధ్యతలు.


సురేష్ కుమార్ – గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా నియామకం.


నారాయణ భరత్ గుప్తా – గోదావరి పుష్కరాల జాయింట్ స్పెషల్ ఆఫీసర్‌గా నియామకం.


ముత్యాలరాజు రేవు – పురావస్తు, మ్యూజియంల కమిషనర్‌గా బదిలీ.


కె.వి.ఎన్. చక్రధర బాబు – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ ఎండీగా FAC బాధ్యతలు.


హెప్సిబా రాణి కొర్లపాటి – హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియామకం; ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా FAC.


పి. అరుణ్ బాబు – డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా నియామకం.


ఎన్. తేజ్ భరత్ – విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ బాధ్యతల నుంచి రిలీవ్.


ప్రఖర్ జైన్ – విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా నియామకం.


గీతాంజలి శర్మ – ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఎండీగా FAC బాధ్యతలు.


చేతన్ టి.ఎస్. – డైరెక్టర్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌గా FAC బాధ్యతలు.


డా. ఎ. శరత్ (రిటైర్డ్ IAS) – తిరుమల తిరుపతి దేవస్థానాల *జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (హెల్త్ & ఎడ్యుకేషన్)*గా కొనసాగింపు.


ప్రభల గోపీనాథ్ – టీటీడీ *జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (హెల్త్ & ఎడ్యుకేషన్)*గా నియామకం.


ఎ.ఎ.ఎల్. పద్మావతి – ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా FAC బాధ్యతలు.


ఎం. జయకృష్ణ – తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియామకం.


బి. అనిల్ కుమార్ రెడ్డి – ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్.


బి. సునీల్ కుమార్ రెడ్డి, IFS – ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా FAC బాధ్యతలు.


తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు కొత్త కమిషనర్‌గా ఎం. జయకృష్ణ IAS.


టీటీడీలో హెల్త్ & ఎడ్యుకేషన్ విభాగానికి జాయింట్ ఈవోగా డా. ఎ. శరత్ కొనసాగింపు.


ప్రభల గోపీనాథ్‌కు టీటీడీ జేఈవో (హెల్త్ & ఎడ్యుకేషన్) బాధ్యతలు.


ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్‌కు ఎ.ఎ.ఎల్. పద్మావతికి FAC బాధ్యతలు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్