శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కుక్కునూరులో ఏజెన్సీ బంద్ విజయవంతం

1 గంట క్రితం

kukkanuru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 12:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కుక్కునూరు రూరల్: ఆదివాసీ గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ, 1/70 చట్టం అమలు, పోడు భూములకు పట్టాల పంపిణీ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన తదితర డిమాండ్ల సాధన కోసం గిరిజన సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన ఏజెన్సీ బంద్ మండలంలో విజయవంతమైంది. బంద్‌కు మద్దతుగా మండలంలోని దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసివేసి సహకరించాయి. బంద్ విజయవంతం కావాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక రామాలయం సెంటర్‌ నుంచి పెట్రోల్ బంక్ వరకు మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పిల్లి రామకృష్ణ, గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు శ్యామల లక్ష్మణరావు, పట్ల లక్ష్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వై. నాగేంద్రరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు వర్షా నాగేశ్వరరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్