ఎన్టీఆర్ : ఎన్టీఆర్ జిల్లాలో 2వ సాధారణ ఎన్నికలు - 2026 లో భాగంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా, సజావుగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 5 మండలాల పరిధిలో గల 72 గ్రామ పంచాయతీలు, 814 వార్డులకు గాను ఏర్పాటు చేసిన 959 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7:00 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మొత్తం 3,11,318 మంది ఓటర్లకు గాను, ఉదయం 11:00 గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా సగటున 43.06 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ వెల్లడించారు.
మండలాల వారీగా ..
జి.కొండూరు మండలం: 51.69%
మైలవరం మండలం: 50.43%
ఇబ్రహీంపట్నం మండలం: 49.87%
రెడ్డిగూడెం మండలం: 48.04%
విజయవాడ రూరల్ మండలం: 34.80% పోలింగ్ నమోదయిందన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. మధ్యాహ్నం 1:00 గంట వరకు పోలింగ్ కొనసాగుతుందని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి నిర్భయంగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.








కామెంట్‌లు (0)