గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రకాశం బ్యారేజీ వద్ద తల్లీబిడ్డల ఆత్మహత్యాయత్నం

17 నవంబర్, 2026

ప్రకాశం బ్యారేజీ వద్ద తల్లీబిడ్డల ఆత్మహత్యాయత్నం 
- కాపాడిన పోలీసులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 08:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కాపాడిన పోలీసులు

​ప్రజాశక్తి - విజయవాడ సిటీ : కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వివాహితను పోలీసులు, ఎన్‌‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది సమయస్ఫూర్తితో రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన తిరుపతి రమాదేవి తన భర్త దనూర్ విశ్వనాథ్‌తో నెలకొన్న కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో మంగళవారం తన కుమార్తెతో కలిసి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీపై అనుమానాస్పదంగా సంచరిస్తూ ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న తల్లీబిడ్డలను అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు, ఎన్‌‌డిఆర్ఎఫ్‌ సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని ‌కాపాడారు. అనంతరం రమాదేవికి పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులను పిలిపించి వారికి అప్పగించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్