శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసాయికృష్ణ కేసులో సిబిఐ విచారణ ప్రారంభం

50 నిమిషాల క్రితం

Sai Krishna lock-up death case reaches Supreme Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 10:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లా ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్‌ ‌డెత్‌ ‌కేసులో సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. సిబిఐ అడిషనల్ ఎస్‌‌పి నేతృత్వంలో ఈ కేసు విచారణ అధికారికంగా ప్రారంభమైంది. ఇటీవల విజయవాడ చేరుకున్న సిబిఐ బృందం... సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో కలిసి ఈ ఘటనకు కేంద్ర బిందువైన కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అక్కడ సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనుంది. ఇప్పటివరకు ఈ కేసు విచారణలో సిట్ సేకరించిన రికార్డులు, ఆధారాలను సిబిఐ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సిబిఐ చేపట్టిన విషయం తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్