టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిని నిలిపివేయడమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అజెండా అని ప్రభుత్వ విప్, టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి వైసిపి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి అనేక కుట్రలు పన్నుతోందన్నారు. 16వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకుండా చేసేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. దౌర్జన్యాలు చేసి నంద్యాలలో ఒక అభ్యర్థి విత్‌డ్రా చేసుకుంటే దానిని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ ప్రెస్‌మీట్ పెట్టి అవాస్తవాలు చెప్పారన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సూచనలను సైతం జగన్ తన రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించారని టిడిపి ఎమ్మెల్యే గళ్లా మాధవి మరో సమావేశంలో అన్నారు. కోర్టు ఇచ్చిన సాధారణ గడువును తన పార్టీ కోసమే ప్రత్యేకంగా ఇచ్చినట్లు జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.








కామెంట్‌లు (0)