సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మైదుకూరు మున్సిపల్ ఎన్నిక వాయిదా : ఎస్‌ఇసి అనిల్ చంద్ర పునేఠా

1 గంట క్రితం

Maidukuru municipal election postponed: SEC Anil Chandra Punetha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 12:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మైదుకూరు (కడప) : వైఎస్సార్ కడప జిల్లాలో మైదుకూరు మున్సిపల్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు. సోమవారం విజయవాడలో అనిల్ చంద్ర పునేఠా మీడియాతో మాట్లాడుతూ ... మైదుకూరులో ఎన్నికలను నిర్వహించడానికి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. నామినేషన్ పత్రాలు చించివేయడంతో వాటి పరిశీలన కష్టమని తెలిపారు. జిల్లా కలెక్టర్ నుంచి అందిన నివేదిక ఆధారంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఎస్ఇసి వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్