సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్టీఆర్ వర్సిటీ నుంచి నోబెల్ బహుమతి గ్రహీతలు రావాలి : ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్

1 గంట క్రితం

Nobel laureates should emerge from NTR University: Vice President C.P. Radhakrishnan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 04:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : భవిష్యత్తులో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నోబెల్ బహుమతి గ్రహీతలు రావాలని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వర్సిటీ 40 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యా, వైద్య, సంక్షేమ, సాంస్కృతిక రంగాలతో పాటు తెలుగు భాషాభివృద్ధికి నందమూరి తారక రామారావు అందించిన సేవలను ఆయన కొనియాడారు. దేశంలోనే తొలి హెల్త్ యూనివర్సిటీని స్థాపించడంలో ఎన్టీఆర్ చూపిన దూరదృష్టి ప్రశంసనీయమని అన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి తాగునీరు అందించిన ఆయన మానవతా దృక్పథాన్ని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి మోడి నాయకత్వంలో వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని రాధాకృష్ణన్ తెలిపారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కొత్త పరిష్కారాలు కనుగొనేందుకు వర్సిటీ విద్యార్థులు అంతర్జాతీయ పరిశోధనల్లో రాణించాలని సూచించారు. వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీల ప్రాధాన్యం పెరుగుతున్నప్పటికీ, వైద్యులు మానవత్వాన్ని ఎన్నడూ మరువకూడదు అని ఆయన హితవు పలికారు. రోగుల పట్ల కరుణ, మానవత్వం, ఆత్మీయత చూపడమే వైద్య వృత్తిలో అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. సమాజంలో మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, దాని దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు వైద్యులు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్