mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రష్యాలో కూలిన బాంబర్ .. సిబ్బంది సురక్షితం

3 రోజుల క్రితం

Russian Tu-22M3 Strategic Bomber Nosedives, Crashes In Siberia
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 10:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మాస్కో : రష్యాకు చెందిన బాంబర్ విమానం (టియు-22ఎం3) కూలిపోయింది. సోమవారం సైబీరియాలోని ఇర్కుట్స్ ప్రాంతంలో శిక్షణనిస్తుండగా విమానం కూలిపోయిందని, ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసిందని రక్షణ శాఖ తెలిపింది. నలుగురు సిబ్బంది సురక్షితంగా బయపడ్డారని పేర్కొంది. విమానం కూలిన దృశ్యాలు మీడియాలో వైరల్ గా మారాయి. అంగారా నది సమీపంలోని అటవీ ప్రాంతంలో విమానం కూలిపోతుండగా, దట్టమైన పొగ వెలువడుతున్న దృశ్యాలు కనిపించాయి. రష్యాకు చెందిన టియు-22ఎం3 బాంబర్ విమానం కూలిపోయిన తర్వాత, అందులోని నలుగురు సిబ్బంది బయటకు దూకారని అధికారులు తెలిపారు. విమానంలో ఎటువంటి యుద్ధ సామాగ్రి లేదని, దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు.

కామెంకా గ్రామానికి సమీపంలో విమానం కూలిపోయిందని ఇర్కుట్స్క్ గవర్నర్ ఇగోర్ కోబ్జెవ్ ధృవీకరించారు. ప్రమాద స్థలంలో చెలరేగిన మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారని అన్నారు. ఇంజన్ వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం జరిగి వుండవచ్చని ఆయన వెల్లడించారు.

టియు-22ఎం3 అనేది ఒక ఆధునిక వెర్షన్, ఇది Kh-22 క్రూయిజ్ క్షిపణులతో పాటు గాలి నుండి ప్రయోగించే హైపర్‌సోనిక్ కింజాల్ క్షిపణులను కూడా మోయగలదు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్