ప్రజాశక్తి-అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లి సెంటర్‌లో గురువారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అమరావతి రాజధాని భూముల పరిశీలన కోసం వైసీపీ నేతలు, సీఆర్డీఏ పరిరక్షణ కమిటీ బృందం వెళ్లగా.. వారిని టీడీపీ శ్రేణులు, సానుభూతిపరులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి, పరిస్థితి అదుపు తప్పింది. రాజధాని ప్రాంత పరిశీలనకు వచ్చిన వైసీపీ నేతలు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డిలతో పాటు సీఆర్డీఏ పరిరక్షణ బృందాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వారిపై కోడిగుడ్లు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ రాళ్లదాడిలో పలువురు పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను సహచర సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత: వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి.. కారు ధ్వంసం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)