ప్రజాశక్తి-విజయవాడ : సాయికృష్ణ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని కీలకమైన సిసి పుటేజీ మాయమైంది. మే 1 నుండి జూన్ 1 వరకు నెల రోజుల సిసి పుటేజీకిగాను కేవలం రెండు రోజుల డేటా మాత్రమే పుటేజీలో ఉన్నట్లు తెలిసింది. మిగిలిన డేటా లేకపోవడంతో సిట్ అధికారులకు సవాలుగా మారింది. పోలీసుస్టేషన్ పుటేజీని భద్రపరచాలని హైకోర్టు ఆదేశించినా మాయం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత నెల 23న విజయవాడ బస్టాండ్ ప్లాట్‌ఫామ్ నంబర్ 42, 44 వద్ద రెండు గుర్తు తెలియని మృతదేహాలు దొరికాయని విజయవాడ నగర పాలక సంస్థకు పోలీసులు లేఖలు రాశారు. అయితే కృష్ణలంక స్వర్గపురి స్మశానవాటిక రికార్డుల్లో గత నెల 23న ఒక మృతదేహం మాత్రమే వచ్చినట్లు నమోదు చేయడం గమనార్హం. గత నెల 23న రాసిన లేఖపై 24వ తేదీ స్టాంప్ ఉండటం, అలాగే వయస్సు నమోదు చోట కొట్టివేతలు ఉండటం బలమైన అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా సాయంత్రం ఆరు గంటలలోపు మాత్రమే మృతదేహాలను స్మశాన వాటిక సిబ్బంది స్వీకరిస్తారు. కానీ పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేసి రాత్రి ఎనిమిది గంటల సమయంలో రెండు మృతదేహాలను తీసుకొచ్చినట్లు స్మశానవాటిక సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్మశానవాటికకు చెందిన బాష అనే వ్యక్తితోపాటు మరికొందరిని అధికారులు విచారించి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ వివరాలను తారుమారు చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Print Editionకృష్ణలంక పోలీస్టేషన్ సిసి పుటేజీ మాయం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 23, 2026, 10:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)