mh ad
మంగళవారం, 23 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజొన్నగిరి కాదు.. స్వర్ణ గ్రామం

2 గంటల క్రితం

Chandrababau-
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 11:43 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కొత్త పేరుకు ప్రభుత్వ నిర్ణయం

  • కూటమి ఐక్యతను గట్టిగా చాటండి

  • పవన్ ని అనవసర విషయాల్లోకి లాగితే *చూస్తూ ఉండొద్దు

  • వైసిపి కుల భేటీలను తిప్పికొట్టాలి

  • మంత్రులకు చంద్రబాబు హితబోధ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : బంగారు గనులున్న జొన్నగిరికి స్వర్ణ గ్రామంగా పేరు పెట్టాలని లాంఛనంగా నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం అయన సహచర మంత్రులతో అంతర్గతంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై వారితో చర్చించారు. కడప ఉక్కు కర్మాగారానికి కూడా జులై మూడో తేదీన శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. నేరచరితులను వైసిపి వెనకేసుకొస్తూ నీచ రాజకీయాలు చేస్తోందని అన్నారు. క్రిమినల్స్ ని వెనకేసుకురావటం, వారికి వంత పాడటం వైసిపికే చెల్లుతోందని వ్యాఖ్యానించారు. వైసిపి నేతలు కుల మీటింగ్ లు పెడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు చేస్తున్నారని, వాటిని ధీటుగా తిప్పికొట్టాలని సూచించారు. కర్నూల్లో జరిగిన ఘటనను ఇందుకు ఉదాహరణగా గుర్తుచేశారు. అక్కడ ఊరంతా బహిష్కరించిన వారిని వైసిపి వెనకేసుకొచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంపైనా ప్రధానంగా చర్చ జరిగింది. పవన్ కల్యాణ్ ను అనవసర విషయాల్లోకి లాగితే కూటమి ఐక్యత చాటేలా మంత్రులంతా స్పందించాలని చంద్రబాబు సూచించారు. డిఎస్సీ సహా వివిధ అంశాలపై వైసిపి చేసే అసత్య ప్రచారాలను మంత్రులంతా ధీటుగా తిప్పికొట్టాలని ఆదేశించారు. ​సాయికృష్ణ ఘటనలో ప్రభుత్వం చిత్తశుద్ధిని అతని తల్లిదండ్రులే నమ్ముతుంటే వైసిపి మాత్రం రాజకీయం చేస్తోందనని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. మంత్రులంతా ప్రతీ శాఖపై అవగాహన పెంచుకోవాలని, తమ పరిధి కాదని కూర్చోకుండా ప్రతీ అంశంపై స్పందించాలని సూచించారు.

​రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసే 5 స్టార్ హోటళ్లకు రాయితీలపైనా చర్చ జరిగింది. ఇందులో మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ హోటళ్లకు కాకుండా వినియోగదారులకు లబ్ది చేకూరేలా రాయితీలు ఉంటే బాగుంటుందని సూచించారు. చంద్రబాబు జోక్యం చేసుకుంటూ రాజధానిలో పెద్ద హోటళ్లు రావాలంటే ఆమాత్రం రాయితీలు అవసరమని వ్యాఖ్యానించగా, ఆ అభిప్రాయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, దుర్గేష్ సమర్ధించారు. అలాగే గ్రేసింగ్ పోరంబోకుల భూముల ద్వారా పంచాయతీలకు ఆదాయం వచ్చేలా చూడాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

చర్చ నుంచి బయటకు వెళ్లిపోయిన చంద్రబాబు

మంత్రివర్గ సమావేశం నుంచి ముఖ్యమంతి బయటకు వెళ్లిపోయిన ఘటన చోటుచేసుకుంది. గీతం విశ్వవిద్యాలయానికి సంబంధించిన అంశం క్యాబినెట్లో వచ్చినప్పుడు ఇది జరిగింది. కొత్త కోర్సు అమల్లోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కొత్త కట్టడాలకు ఆమోదం వంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడు తమ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థ కాబట్టి తాము ఉండటం సబబు, సంప్రదాయం కాదని సహచరులకు చెబుతూ చంద్రబాబు, లోకేష్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం విశేషం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్