ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రాన్ని పోలియో రహిత రాష్ట్రంగా కొనసాగించేందుకు ఈ నెల 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసు గల 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ అంశంపై మంగళవారం ఆయన వీడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో 29,873 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా, వలస కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1,757 ప్రత్యేక బృందాలను నియమించారని తెలిపారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు తదితర ప్రాంతాల్లో 1,144 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జూన్ 28న పోలియో కేంద్రాల్లో చుక్కలు వేయగా, 29, 30 తేదీల్లో ఇంటింటి సందర్శన ద్వారా మిగిలిన చిన్నారులకు పోలియో చుక్కలు అందించనున్నారు. కార్యక్రమ నిర్వహణలో 1.31 లక్షల మంది సిబ్బంది పాల్గొననున్నారని పేర్కొన్నారు. సాధారణ టీకాల్లో పోలియో చుక్కలు తీసుకున్న పిల్లలకు కూడా పల్స్ పోలియో వేయించాలని సూచించారు.
Print Edition28న పల్స్ పోలియో : మంత్రి సత్యకుమార్ యాదవ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 23, 2026, 11:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)