ప్రజాశక్తి - అమరావతి : మాజీ మంత్రి, వైసిపి సీనియర్ నేత అంబటి రాంబాబు దాఖలు చేసిన కేసులో నల్లపాడు సిఐ కె. వంశీధర్, ఎస్‌ఐ అద్దంకి పవన్‌కుమార్, పట్టాభిపురం సిఐ జి.వెంకటేశ్వర్లుకు హైకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. తనను చట్టవిరుద్ధంగా నిర్బంధించి కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారంటూ గుంటూరు జిల్లా నల్లపాడు, పట్టాభిపురం పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరిన పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన రావు.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూలై 30కు వాయిదా వేశారు. ఏడేళ్లలోపు శిక్ష విధించే కేసుల్లో తనను అక్రమంగా అరెస్ట్ చేసి శారీరక, మానసిక వేధింపులకు గురిచేశారని పేర్కొంటూ అంబటి రాంబాబు మూడు ధిక్కార వ్యాజ్యాలు దాఖలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి వ్యవహారంపై అంబటి వ్యాఖ్యలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతల ఫిర్యాదుపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. మరో కేసులో పట్టాభిపురం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో తన అరెస్టు చట్టవిరుద్ధమని పేర్కొంటూ అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు.
Print Editionఅంబటి కేసులో ముగ్గురు పోలీసు అధికారులకు కోర్టు ధిక్కార నోటీసులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 23, 2026, 11:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)