mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

16 రకాల మెడిసిన్స్ పై కేంద్రం నిషేధం

3 గంటల క్రితం

Centre bans 16 fixed-dose drug combinations
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 04:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : 16 రకాల మెడిసిన్స్ పై కేంద్రం నిషేధం విధించింది. ప్రజారోగ్య సంబంధిత ఆందోళనల నేపథ్యంలో 16 ఫిక్సిడ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్ డి సి)మెడిసిన్స్ తయారీ, విక్రయం, పంపిణీని నిషేధించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఔషధాలు, సౌందర్యసాధనాల చట్టం 1940లోని సెక్షన్ 26 ఎ కింద వాటిపై నిషేధం విధించినట్లు పేర్కొంది. చికిత్సకు వినియోగించినప్పటికీ సమర్థవంతమైన ఫలితం లేకపోవడం, వాటివలన కలిగే ముప్పులతో పోలిస్తే వాటిని నిరంతరం వాడటం వలన ప్రయోజనం లేదని పేర్కొంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధ పదార్ధాల (ఎపిఐఎస్)ను నిర్దిష్ట నిష్పత్తిలో కలిగి ఉండే మెడిసిన్స్ ను ఎఫ్ డి సిగా పేర్కొంటారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎఫ్ డి సి లపై జరిపిన సమీక్ష అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలిపింది. వివిధ మెడిసిన్స్ సమ్మేళనాన్ని పరిశీలించి, వాటిలో చికిత్సపరంగా సమర్థనీయం కానివి లేదా హాని కలిగించే అవకాశం ఉన్న వాటిని గుర్తించేందుకు డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (డిటిఎబి)ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కొన్ని చర్మ సంబంధిత మందులు, నొప్పి నివారణ మందులు, కండరాల సడలింపు మందులు, యాంటిబయాటిక్ ఆధారిత మెడిసిన్స్ ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా జ్వరం, దగ్గు, అలర్జీ చికిత్సకు వినియోగించే 156 మెడిసిన్స్ నిషేధం విధించిన వాటిలో ఉన్నాయి. అలాగే కలబంద లేదా కలబంద గుజ్జుతో పాటు విటమిన్ ఇ, జోజోబా నూనె, నారింజ నూనె, గోధుమ మొలకల నూనె, టీ ట్రీ ఆయిల్, అల్లంటోయిన్, డి-పాంథెనాల్ వంటి పదార్థాల కలయికలను కలిగి ఉన్న అనేక చర్మవ్యాధి, చర్మ సంరక్షణ ఫార్ములేషన్లు కూడా ఉన్నాయి. ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేసేలా చూడాలని అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణాధికారులను ఆదేశించింది. తయారీదారులు, దిగుమతిదారులు, పంపిణీదారులు, ఇతర భాగస్వాములకు కూడా చట్టానికి అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని సూచించింది.







ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్