మహబూబ్ నగర్ (తెలంగాణ) : మహిళా నాయకురాలు కామ్రేడ్ వి.సుమతి కన్నుమూశారు. సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ సిపిఎం మాజీ కార్యదర్శి పి.మధు సతీమణి, ఐద్వా రాష్ట్ర నాయకులు కామ్రేడ్ సుమతి 25వ తేదీ మంగళవారం మహబూబ్ నగర్ లోని సుశ్రుత హాస్పిటల్ లో ఉదయం 8 గంటల 30 నిముషాలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కి ఆమె పార్థివ దేహాన్ని అందజేయనున్నారు. ఆమె మృతికి నేతలు సంతాపం తెలియజేశారు. కామ్రేడ్ సుమతి సైన్స్ ఉద్యమంలో ముఖ్యంగా అక్షరాశ్యతా ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. నాడు BGVS లో వర్కింగ్ కమిటీ మెంబర్ గా ఉన్నారు.
మహిళా నేత కామ్రేడ్ వి.సుమతి కన్నుమూత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 25, 2026, 11:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)