సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సముద్రాలు వేడెక్కితే తీర ప్రాంతానికి వచ్చే ప్రమాదమేమిటి?

36 నిమిషాల క్రితం

el nino
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 05:30 పూర్వాహ్నం | 9 నిమిషాల చదవడం

మనకు జ్వరం వస్తే థర్మామీటర్ పెట్టుకుంటాం…అయ్యో! 1020F వచ్చింది అంటూ భయపడతాం. మరి భూమిపై దాదాపు 71 శాతం భూభాగాన్ని కప్పి ఉన్న మహాసముద్రానికి వేడి పెరిగితే? అది థర్మామీటర్ పెట్టుకుని నాకు కూడా 3 డిగ్రీలు పెరిగింది అని చెప్పలేదు కదా!. కానీ సముద్రం వేడెక్కితే మాత్రం విషయం చాలా సీరియస్. ఎల్ నినో వస్తే వాతావరణం తన షెడ్యూల్ మార్చుకుంటుంది. లానినో వస్తే మరో షెడ్యూల్ తయారు చేసుకుంటుంది. వర్షాలు ఎక్కడ పడాలో అక్కడ పడకుండా…ఈసారి మనం కాస్త కొత్తగా ట్రై చేద్దాం అన్నట్టుగా ప్రవర్తిస్తాయి. సముద్రం వేడెక్కుతుంది. బాష్పీభవనంపెరుగుతుంది. వాతావరణంమారుతుంది. వర్షపాతంలో మార్పులు వస్తాయి, రైతుల కష్టాలు పెరుగుతాయి.అంటే సముద్రానికి వచ్చిన వేడి చివరికి రైతు పొలానికి కూడా చేరుతుంది. ఇక పగడపు దిబ్బలు అయితే వేడిని తట్టుకోలేక Coral Bleachingకు గురవుతాయి. సముద్ర మట్టం పెరిగితే తీర ప్రాంతప్రజలు అయ్యో… మా ఇల్లు ఎక్కడ? అని ఆందోళన చెందాల్సి వస్తుంది. కాబట్టి ఇది కేవలం సముద్రం వేడెక్కుతున్న కథ కాదు.మన వాతావరణం, వర్షాలు, వ్యవసాయం, సముద్ర జీవులు, తీర ప్రాంతాలు ఇలా అన్నింటితోనూ సంబంధం ఉన్న కథ. మరి ఇప్పుడు చూద్దాం. సముద్రానికి నిజంగానే జ్వరం వచ్చిందా? ఎల్ నినో ఏం చేస్తుంది? మన వర్షాలకు దానితో సంబంధం ఏమిటి? “చేపలు, పగడపు దిబ్బలకు ఏం జరుగుతుంది?” ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ క్రింది ప్రశ్నలతో ‘సముద్ర ప్రయాణం’ మొదలుపెడదాం!.


1. ప్రపంచ వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించేది ఏది?

A) ఎడారులు B) మహాసముద్రాలు

C) పర్వతాలు మాత్రమేD) అరణ్యాలు మాత్రమే

2. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతకు ఉపయోగించే సంక్షిప్త రూపం ఏది?

A) SSTB) SLPC) UVRD) GHG

3. SST యొక్క పూర్తి రూపం ఏమిటి?

A) Sea Surface Temperature

B) Solar Surface Temperature

C) Sea Solar Transfer

D) Surface Sea Transfer

4. ఎల్ నినో ప్రధానంగా ఏ మహాసముద్రంలోని ఉష్ణమండల ప్రాంతానికి సంబంధించిన వాతావరణ దృగ్విషయం?

A) ఆర్కిటిక్ మహాసముద్రం B) పసిఫిక్ మహాసముద్రం

C) అట్లాంటిక్ మహాసముద్రం D) హిందూ మహాసముద్రం

5. ఏ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది?

A) మధ్య మరియు తూర్పు ఉష్ణమండల పసిఫిక్

B) ఉత్తర అట్లాంటిక్

C) దక్షిణ హిందూ మహాసముద్రం D) ఆర్కిటిక్ ప్రాంతం

6. లా నినా, ఎల్ నినోకు ఎలా సంబంధించింది?

A) పూర్తిగా సంబంధం లేనిది B) దానికి విరుద్ధమైన ENSO దశ

C) ఒక తుపాను పేరు D) ఒక సముద్రప్రవాహం

7. ENSO యొక్క పూర్తి రూపం ఏమిటి?

A) El Nino–Southern Oscillation

B) Eastern North Sea Oscillation

C) Equatorial Northern Solar Oscillation

D) Earth Natural Sea Operation

8. ఎల్ నినో సమయంలో మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్‌లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణంగా ఎలా ఉంటుంది?

A) సాధారణం కంటే తక్కువ B) సాధారణం కంటే ఎక్కువ

C) ఎటువంటి మార్పు ఉండదు D) పూర్తిగా గడ్డకడుతుంది

9. లా నినా సమయంలో మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్‌లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణంగా ఎలా ఉంటుంది?

A) సాధారణం కంటే ఎక్కువ B) సాధారణం కంటే తక్కువ

C) మార్పు ఉండదు D) 50°Cకి చేరుతుంది

10. లా నినా, ఎల్ నినో కలిసి ఏ వాతావరణ వ్యవస్థలోని రెండు ప్రధాన దశలు?

A) ENSOB) Ozone Cycle

C) Carbon CycleD) Water Cycle

11. ఎల్ నినో ప్రభావం ప్రధానంగా దేనిపై కనిపిస్తుంది?

A) భూమి ఆకారంపై B) ప్రపంచ వాతావరణ నమూనాలపై

C) చంద్రుని కక్ష్యపై D) భూమి పరిమాణంపై

12. ఎల్ నినో సమయంలో వాణిజ్య గాలుల ప్రవర్తన సాధారణంగా ఎలా మారుతుంది?

A) ఎటువంటి మార్పు ఉండదు B) ఎల్లప్పుడూ రెట్టింపు అవుతుంది

C) పూర్తిగా మంచుగా మారుతుంది D) బలహీనపడవచ్చు

13. సముద్రాలు భూతాపం వల్ల పెరిగిన వేడిలో ఎక్కువ భాగాన్ని ఏమి చేస్తాయి?

A) గ్రహిస్తాయిB) నాశనం చేస్తాయి

C) వెంటనే అంతరిక్షంలోకి పంపిస్తాయి D) మంచుగా మారుస్తాయి

14. సముద్రాలు అధిక వేడిని గ్రహించడం వల్ల ప్రధానంగా ఏ మార్పు సంభవిస్తుంది?

A) సముద్రం తీయగా మారుతుంది

B) సముద్రం పూర్తిగా ఎండిపోతుంది

C) సముద్ర ఉష్ణోగ్రత పెరుగుతుంది

D) సముద్రం గడ్డకడుతుంది

15. సముద్ర ఉష్ణోగ్రత పెరగడం వల్ల బాష్పీభవనం సాధారణంగా ఎలా మారుతుంది?

A) పూర్తిగా ఆగిపోతుందిB) తగ్గుతుంది

C) పెరుగుతుందిD) మారదు

16. అధిక బాష్పీభవనం వాతావరణంలో దేనిని పెంచుతుంది?

A) నీటి ఆవిరిB) ఆక్సిజన్ మాత్రమే

C) నైట్రోజన్ మాత్రమేD) ధూళి మాత్రమే

17. సముద్ర ఉష్ణోగ్రతల దీర్ఘకాలిక పెరుగుదలను ఏమని పిలుస్తారు?

A) సముద్ర గడ్డకట్టడంB) సముద్ర వేడెక్కడం

C) సముద్ర శీతలీకరణD) సముద్ర ఎండిపోవడం

18. “Ocean Heat Content” అంటే ఏమిటి?

A) సముద్రంలో నిల్వ ఉన్న వేడి పరిమాణం

B) సముద్రంలోని ఉప్పు పరిమాణం

C) సముద్రంలోని చేపల సంఖ్య D) సముద్రపు లోతు

19. సముద్రప్రవాహాలు ప్రధానంగా దేనిని ప్రభావితం చేస్తాయి?

A) చంద్రుని కక్ష్యనుB) భూమి ఆకారాన్ని

C) ఉష్ణోగ్రత మరియు వాతావరణాన్ని D) సూర్యుని పరిమాణాన్ని

20. సముద్రప్రవాహాల ద్వారా వేడి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఏమవుతుంది?

A) రవాణా అవుతుంది B) పూర్తిగా నశిస్తుంది

C) మంచుగా మారుతుంది D) భూమిలోకి మాత్రమే వెళుతుంది

21. గ్లోబల్ వార్మింగ్‌కు దోహదపడే వాయువుల సమూహాన్ని ఏమంటారు?

A) గ్రీన్‌హౌస్ వాయువులు B) అరుదైన వాయువులు

C) నోబుల్ వాయువులు D) జడ వాయువులు

22. కింది వాటిలో మానవ కార్యకలాపాల వల్ల అధికంగా విడుదలయ్యే ముఖ్యమైన గ్రీన్‌హౌస్ వాయువు ఏది?

A) ఆక్సిజన్B) కార్బన్ డయాక్సైడ్

C) నైట్రోజన్D) హీలియం

23. CO2 యొక్క పూర్తి పేరు ఏమిటి?

A) Carbon DioxideB) Calcium Dioxide

C) Carbon OxygenD) Calcium Oxygen

24. భూమి వాతావరణంలో వేడి చిక్కుకుపోయే ప్రక్రియను ఏమంటారు?

A) గ్రీన్‌హౌస్ ప్రభావంB) ఆవిరీభవనం

C) ఘనీభవనంD) ఉత్క్రమణ

25. “Global Warming” ప్రధానంగా దేనిని సూచిస్తుంది?

A) గాలి వేగం పెరగడం మాత్రమే

B) సముద్రాల గడ్డకట్టడం

C) వర్షపాతం తగ్గడం మాత్రమే

D) భూమి సగటు ఉష్ణోగ్రతలో దీర్ఘకాలిక పెరుగుదల

26. “Climate Change” అంటే ఏమిటి?

A) ఒకరోజు ఉష్ణోగ్రత మార్పు మాత్రమే

B) దీర్ఘకాలిక వాతావరణ నమూనాల్లో మార్పు

C) ఒక తుపాను మాత్రమే

D) ఒక వర్షపు సంఘటన మాత్రమే

27. Global Warming మరియు Climate Change మధ్య సరైన సంబంధం ఏది?

A) Global warming వాతావరణ మార్పులో ఒక ప్రధాన భాగం

B) రెండూ పూర్తిగా సంబంధం లేనివి

C) Climate change అనేది కేవలం వర్షం

D) Global warming అనేది కేవలం గాలి వేగం

28. అడవులు వాతావరణ మార్పులను తగ్గించడంలో ఎలా సహాయపడతాయి?

A) CO2ను ఉత్పత్తి చేయడం ద్వారా

B) CO2ను గ్రహించడం ద్వారా

C) సముద్రాలను వేడెక్కించడం ద్వారా

D) వర్షాలను పూర్తిగా ఆపడం ద్వారా

29. “Carbon Sink”గా పనిచేసే వ్యవస్థకు ఉదాహరణ ఏది?

A) అడవులుB) ప్లాస్టిక్ వ్యర్థాలు

C) బొగ్గు దహనంD) పెట్రోలు వాహనాలు

30. వాతావరణ మార్పులను తగ్గించడానికి అత్యంత ముఖ్యమైన చర్య ఏది?

A) బొగ్గు వినియోగం పెంచడం B) అడవులను నరికివేయడం

C) గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం

D) ఇంధన వృథాను పెంచడం

31. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సముద్ర జీవులపై ఎలాంటి ప్రభావం ఉండవచ్చు?

A) వాటి నివాస ప్రాంతాలు మారవచ్చు

B) అన్ని జీవులు పెరుగుతాయి

C) ఎలాంటి ప్రభావం ఉండదు

D) అన్ని జీవులు ఒకే ప్రాంతంలో చేరతాయి

32. అధిక సముద్ర ఉష్ణోగ్రతలకు ప్రత్యేకంగా సున్నితమైన సముద్ర పర్యావరణ వ్యవస్థ ఏది?

A) పగడపు దిబ్బలుB) ఎడారి ఇసుక

C) పర్వత శిఖరాలుD) భూగర్భ గుహలు

33. పగడపు దిబ్బలు అధిక ఉష్ణోగ్రత ఒత్తిడికి గురైనప్పుడు జరిగే ప్రక్రియను ఏమంటారు?

A) Coral meltingB) Coral freezing

C) Coral bleachingD) Coral rotation

34. Coral bleaching అంటే ఏమిటి?

A) పగడాలు తమ సహజ రంగును కోల్పోయే ప్రక్రియ

B) పగడాలు మంచుగా మారడం

C) పగడాలు వేగంగా పెరగడం D) పగడాలు ఉప్పును కోల్పోవడం

35. సముద్ర ఉష్ణోగ్రత పెరగడం వల్ల మత్స్య పరిశ్రమపై ఎలాంటి ప్రభావం ఉండవచ్చు?

A) అన్ని చేపలు ఒకే ప్రాంతంలో చేరతాయి

B) చేపల సంఖ్య ఎప్పుడూ రెట్టింపు అవుతుంది

C) ఎలాంటి ప్రభావం ఉండదు

D) చేపల పంపిణీ మారవచ్చు

36. సముద్రాల్లో అధిక CO2 గ్రహించబడటం వల్ల ఏర్పడే ప్రధాన సమస్య ఏది?

A) సముద్ర ఆమ్లీకరణB) సముద్ర తీపీకరణ

C) సముద్ర గడ్డకట్టడంD) సముద్రం ఎండిపోవడం

37. సముద్ర ఆమ్లీకరణ ముఖ్యంగా ఏ జీవులకు సమస్యగా మారొచ్చు?

A) పక్షులు మాత్రమే B) షెల్ లేదా కవచం ఏర్పరుచుకునే జీవులు

C) భూమి పురుగులు మాత్రమే D) ఎడారి మొక్కలు

38. మనదేశంలో ఏ వాతావరణ వ్యవస్థపై ఎల్ నినో ప్రభావం చూపగలదు?

A) నైరుతి రుతుపవనాలు B) చంద్రగ్రహణం

C) భూమి గురుత్వాకర్షణ D) భూమి భ్రమణ వేగం

39. దేశంలో వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైన వాతావరణ అంశాలలో ఒకటి ఏది?

A) మంచు తుఫానులుB) రుతుపవన వర్షాలు

C) అగ్నిపర్వతాలుD) ధ్రువ కాంతులు

40. ఎల్‌ నినో వల్ల భారతదేశంలో సాధారణంగా ఏ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది?

A) రుతుపవనాలు బలహీనపడే అవకాశం B) ఎల్లప్పుడూ భారీ వర్షాలు

C) దేశమంతా మంచు కురవడం D) సముద్రం ఎండిపోవడం

41. వర్షపాతం తగ్గితే ఏ రంగం ఎక్కువగా ప్రభావితమవుతుంది?

A) వ్యవసాయం B) అంతరిక్ష పరిశోధన మాత్రమే

C) విమాన తయారీ మాత్రమే D) కంప్యూటర్ పరిశ్రమ మాత్రమే

42. వర్షపాతం తగ్గడం వల్ల ప్రధానంగా ఏ సమస్య ఏర్పడొచ్చు ?

A) సముద్ర భూకంపంB) మంచు తుఫాను

C) కరువుD) సూర్యగ్రహణం

43. మార్పులకు అనుగుణంగా వ్యవసాయంలో తీసుకోవాల్సిన చర్య ఏది?

A) నీటి సంరక్షణ మరియు వాతావరణానుకూల పద్ధతులు

B) నీటిని వృథా చేయడం

C) పంటల వైవిధ్యాన్ని తగ్గించడం D) నేలను నిర్లక్ష్యం చేయడం

44. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం తుపానులపై ఎలా ప్రభావం చూపగలదు?

A) తుపానులను మంచుగా మారుస్తుంది

B) అన్ని తుపానులను ఆపుతుంది

C) తుపానులకు ఎలాంటి సంబంధం లేదు

D) కొన్ని పరిస్థితుల్లో తుపానులకు అధిక శక్తిని అందించవచ్చు

45. ఉష్ణమండల తుపానులకు ప్రధాన శక్తి వనరులలో ఒకటి ఏది?

A) వెచ్చని సముద్ర జలాలు B) మంచు

C) ఎడారి ఇసుక D) పర్వత మంచు మాత్రమే

46. సముద్ర మట్టం పెరగడానికి కింది వాటిలో ఏది ఒక కారణం?

A) చంద్రుని పరిమాణం పెరగడం B) సముద్ర జలాల ఉష్ణ విస్తరణ

C) భూమి రంగు మారడం D) గాలి పూర్తిగా ఆగిపోవడం

47. వేడెక్కిన సముద్రజలం సాధారణంగా ఎలా ప్రవర్తిస్తుంది?

A) విస్తరిస్తుంది B) ఎల్లప్పుడూ కుంచించుకుంటుంది

C) గడ్డకడుతుంది D) ఘన పదార్థంగా మారుతుంది

48. హిమానీనదాలు, మంచు పలకలు కరగడం వల్ల ప్రధానంగా ఏ సమస్య పెరుగుతుంది?

A) సముద్రమట్టం తగ్గుదల B) సముద్రమట్టం పెరుగుదల

C) భూమి భ్రమణం ఆగిపోవడం D) వర్షాలు పూర్తిగా ఆగిపోవడం

49. సముద్రమట్టం పెరగడం వల్ల ఎక్కువగా ప్రమాదంలో ఉండేవి ఏవి?

A) తీర ప్రాంతాలు B) ఎత్తైన పర్వత శిఖరాలు

C) ఎడారుల మధ్య ప్రాంతాలు D) భూగర్భ గుహలు

50. సముద్ర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరాలలో ఒకటి ఏది?

A) థర్మామీటర్B) బారోమీటర్

C) అనీమోమీటర్D) సీస్మోగ్రాఫ్

51. వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం ఏది?

A) బారోమీటర్B) థర్మామీటర్

C) హైగ్రోమీటర్D) లాక్టోమీటర్

52. గాలి వేగాన్ని కొలిచే పరికరం ఏది?

A) సీస్మోమీటర్B) బారోమీటర్

C) థర్మామీటర్D) అనీమోమీటర్

53. వాతావరణంలోని నీటి ఆవిరి పరిమాణాన్ని సూచించే అంశం ఏది?

A) పీడనంB) ఆర్ద్రత C) ఉష్ణ ప్రసరణ D) గురుత్వాకర్షణ

54. ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది?

A) హైగ్రోమీటర్ B) బారోమీటర్ C) అనీమోమీటర్ D) సీస్మోగ్రాఫ్

55. పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత మార్పులను పర్యవేక్షించడానికి ఏవి ఉపయోగపడతాయి?

A) టెలిస్కోపులుB) కేవలం కంటితో చూడటం

C) భూకంప పరికరాలు

D) ఉపగ్రహాలు మరియు సముద్ర పరిశీలనా వ్యవస్థలు

56. సముద్రాలపై ఉపగ్రహ పరిశీలన ఎందుకు ముఖ్యమైనది?

A) సముద్రాన్ని ఎండబెట్టడానికి

B) చేపలను పట్టుకోవడానికి

C) విస్తారమైన సముద్ర ప్రాంతాలను పర్యవేక్షించడానికి

D) సముద్రపు ఉప్పును తొలగించడానికి

57. సముద్ర ఉష్ణోగ్రతలను నిరంతరం పర్యవేక్షించడం వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటి?

A) సముద్ర ఉష్ణోగ్రతను వెంటనే సున్నాకు తగ్గించవచ్చు

B) ముందస్తు హెచ్చరికలు ఇవ్వడానికి సహాయపడుతుంది

C) తుపానులను పూర్తిగా ఆపవచ్చు D) వర్షాలను నియంత్రించవచ్చు

58. “Early Warning System” యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

A) సముద్రాన్ని నియంత్రించడం B) వాతావరణాన్ని మార్చడం

C) ప్రమాదాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడం

D) తుపానులను సృష్టించడం

59. కింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరు ఏది?

A) సౌరశక్తిB) బొగ్గుC) పెట్రోలుD) సహజ వాయువు

60. గాలి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరం ఏది?

A) హైగ్రోమీటర్ B) థర్మామీటర్ C) బారోమీటర్ D) విండ్ టర్బైన్


జ వా బు లు :

1 - B11 – B21 – A31 – A41 - A51 - A 2 – A12 – D22 - B32 – A42 - C52 - D 3 – A13 – A23 – A33 – C43 - A53 - B 4 – B14 – C24 – A34 – A44 - D54 - A 5 – A15 – C25 – D35 – D45 - A55 - D 6 – B16 – A26 – B36 – A46 - B56 - C 7 – A17 – B27 – A37 – B47 - A57 - B 8 – B18 – A28 – B38 – A48 - B58 - C 9 - B19 – C29 – A39 – B49 - A59 - A 10 - A20 - A30 – C40 – A50 - A60 - D


- డాక్టర్. పల్లె. సూర్యనాగి రెడ్డి

భౌతికశాస్త్ర అధ్యాపకులు

ప్రభుత్వ కళాశాల (అటానమస్), అనంతపురం.

మొబైల్ నం.: 9491155894

ఈ-మెయిల్: suryassbn19@gmail.com

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్