- ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
- వచ్చే ఐదేళ్లలో రూ.850 కోట్ల పెట్టుబడులు..
ప్రజాశక్తి - హైదరాబాద్ : ఎంటర్‌ప్రైజ్ డేటా ఇంటెలిజెన్స్ రంగంలోని గ్లోబల్ సంస్థ స్ప్లాష్‌బిఐ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జిసిసి)ను ప్రారంభించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విఎస్‌డి టెక్ పార్క్‌లో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), ప్రొడక్ట్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ విభాగాల విస్తరణతో పాటు ఎఐ డేటా సెంటర్ అభివృద్ధికి రాబోయే ఐదేళ్లలో రూ.850 కోట్లకు పైగా (100 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో ఏఐ డేటా సెంటర్ కోసం నాలుగు మిలియన్ డాలర్లు కేటాయించనున్నట్లు తెలిపింది. ఈ కేంద్రం ద్వారా 39 దేశాల్లోని 500కు పైగా ఎంటర్‌ప్రైజ్ వినియోగదారులకు సేవలందించనుంది. హైదరాబాద్‌లోని తమ ఉద్యోగుల సంఖ్యను రాబోయే రోజుల్లో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ సిఇఒ నవీన్ మిగ్లానీ, ప్రెసిడెంట్ కిరణ్ రెడ్డి పషమ్ వెల్లడించారు. తెలంగాణను అంతర్జాతీయ సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక వసతులు, విధానపరమైన మద్దతును ప్రభుత్వం అందిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో అంతర్జాతీయ సంస్థల విస్తరణకు స్ప్లాష్‌బిఐ నిర్ణయం నిదర్శనమని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)