ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జెర్రీ మాండరింగ్ అంటే ....

15 నిమిషాల క్రితం

jeeri
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 30, 2026, 12:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : నియోజకవర్గాల పునర్విభజన బిల్లు సందర్బంగా మీడియాలో విస్తృతంగా వాడుతున్న కొత్త పదం జెర్రీ మాండరింగ్. దీని అర్థం ఎన్నికల్లో ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా, నియోజకవర్గాల సరిహద్దులను ఉద్దేశపూర్వకంగా మార్చడం. దీనివల్ల ఓట్ల శాతంలో పెద్దగా మార్పు లేకపోయినా, గెలిచే సీట్ల సంఖ్యలో భారీ మార్పు వస్తుంది.

ఈ పదం ఎలా పుట్టింది?

1812లో అమెరికాలో మసాచుసెట్స్ గవర్నర్‌గా ఉన్న ఎల్‌బ్రిడ్జ్ గెర్రీ తన పార్టీకి లబ్ధి చేకూరేలా ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను మార్చారు. ఆ మార్పుల వల్ల ఒక నియోజకవర్గం ఆకారం వింతగా, ఒక సాలమాండర్ అనే జీవిని పోలినట్లు తయారైంది. అప్పటి పత్రికలు గవర్నర్ పేరులోని గెర్రీ, ఆ జీవి పేరులోని మాండర్ పదాలను కలిపి ‘జెర్రీమాండర్‌’ అని వ్యంగ్యంగా కార్టూన్స్ వేశాయి. అప్పటి నుండి ఈ పద్ధతికి ఆ పేరు స్థిరపడిపోయింది.

ఇది ఎలా అమలవుతుంది?

ప్యాకింగ్, క్రాకింగ్ అనే రెండు పద్ధతుల ద్వారా ఇది అమలవుతుంది. ప్యాకింగ్ అంటే ప్రత్యర్థి పార్టీకి మద్దతు ఇచ్చే ఓటర్లందరినీ ఒకే నియోజకవర్గంలోకి చేర్చడం. దీనివల్ల ప్రత్యర్థి పార్టీ ఆ ఒక్క సీటును భారీ మెజారిటీతో గెలుచుకున్నా, చుట్టుపక్కల ఉన్న మిగిలిన నియోజకవర్గాల్లో బలహీనపడుతుంది. క్రాకింగ్ అంటే ప్రత్యర్థి పార్టీ ఓటర్లను చిన్న చిన్న సమూహాలుగా విడగొట్టి, పలు నియోజకవర్గాల్లో కలిపేయడం. దీనివల్ల ఏ నియోజకవర్గంలోనూ వారికి మెజారిటీ రాకుండా ఓట్లు చీలిపోతాయి. ఈ విధానం ద్వారా రాజకీయ పార్టీలతో పాటు లక్ష్యంగా చేసుకున్న మతంతో పాటు, వెనుకబడిన జాతులు, తెగలు, కులాల ప్రాతినిథ్యాన్ని తగ్గించడం జరుగుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్