మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభారత్‌, చైనా రికార్డు చమురు దిగుమతులు

25 నిమిషాల క్రితం

crude-oil
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 11:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఈ ఏడాది భారత్‌, చైనా రష్యా చమురు కొనుగోళ్లను భారీగా పెంచాయి. నవంబర్‌ మధ్య వరకు ఈ రెండు దేశాలు రోజుకు సగటున 34 లక్షల బ్యారెళ్ల రష్యా చమురును దిగుమతి చేసుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే రోజుకు 5.3 లక్షల బ్యారెళ్ల పెరుగుదల నమోదైంది. రష్యా చమురు ఎగుమతులు ఈ ఏడాది 6 శాతం పెరిగి 244.7 మిలియన్‌ టన్నులకు చేరవచ్చని అంచనా. భారత్‌ నవంబర్‌ తొలి వారాల వరకు రోజుకు 19.9 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోగా.. దేశ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా దాదాపు 38 శాతానికి చేరింది. చైనా జనవరి-అక్టోబర్‌ మధ్య రష్యా చమురు దిగుమతులను 17 శాతం పెంచి రోజుకు 23.4 లక్షల బ్యారెళ్లకు చేర్చింది. భారత్‌ దిగుమతులు ఇదే కాలంలో 10 శాతం పెరిగి రోజుకు 18.7 లక్షల బ్యారెళ్లకు చేరాయి. అయితే 2027లో పశ్చిమాసియా చమురు సరఫరాలు సాధారణ స్థితికి వస్తే భారత్‌, చైనా రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించే అవకాశముంది. అంతర్జాతీయ ధరలు, సరఫరా పరిస్థితుల ఆధారంగా తదుపరి దిగుమతులు మారవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్